Begin typing your search above and press return to search.

ముగిసిన తొలిదశ: బెంగాల్, అసోం మొగ్గు ఎటు?

By:  Tupaki Desk   |   28 March 2021 7:01 AM GMT
ముగిసిన తొలిదశ: బెంగాల్, అసోం మొగ్గు ఎటు?
X
పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్ లో 30 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. రెండు రాష్ట్రాల్లో జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.

కరోనా నేపథ్యంలో ఈషారి పోలింగ్ సమయం పెంచారు. సాయంత్రం 6 గంటల వరకు అనుమతించారు. అసోంలో 47 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా 72శాతంకు పైగా పోలింగ్ నమోదైంది. సాయంత్రం వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు హక్కు కల్పించారు.

శనివారం సాయంత్రం 6 గంటలకు పశ్చిమ బెంగాల్ల ో 79.79శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో 72.14శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు.

ఇక బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సల్బొని పోలింగ్ బూత్ వద్ద సీపీఎం, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి. బీజేపీ, టీఎంసీల మధ్య మోహన్ పూర్ లో ఘర్షణ జరిగింది.

ఇక పోలింగ్ సరళిని బట్టి చూస్తే బెంగాల్ లో మమతా బెనర్జీ టీఎంసీ వైపు ప్రజల మొగ్గు కనిపించిందని సర్వేలు చెబుతున్నాయి. ఇక అసోంలో మాత్రం బీజేపీ ఎడ్జ్ కనిపించినా కాంగ్రెస్ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందని అంటున్నారు.