Begin typing your search above and press return to search.
ఏ క్షణమైనా భూగోళం బద్దలు కావచ్చు.. హెచ్చరిస్తున్న అంతరిక్ష పరిశోధకులు..!
By: Tupaki Desk | 6 Jan 2021 8:41 AM GMTప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ భూమండలం ఏ క్షణమైనా బద్దలు కావచ్చొని అంతరీక్ష పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకు కారణం భూమివైపు ఉల్కలు వేగంగా వస్తుండటమే. గతంలో భూమి మీద అనేక ఉల్కలు పడ్డాయి. కానీ అవి చాలా చిన్నవి. అయితే ఇప్పుడు అతి పెద్ద ఉల్కలు భూమివైపుకు దూసుకొస్తున్నాయి. ఈ ఉల్కలు గనక భూమిమీద పడితే భూమి ధ్వంసం కావడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2020 వ సంవత్సరం ప్రజలు కరోనా మహమ్మారితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక వ్యాక్సిన్ వచ్చేస్తోంది అంతా సేఫ్ అనుకున్న టైంలో కొత్త స్ట్రెయిన్ ముంచుకొచ్చింది. 2020 చివరి నెలలో కరోనా కొత్త స్ట్రెయిన్ ముంచు కొచ్చింది. అయితే ఇప్పటికే కొత్త స్ట్రెయిన్‌తో పలు దేశాలు వణికిపోతున్నాయి. మరోవైపు భారత్‌లో బర్డ్‌ఫ్లూ కూడా వ్యాపిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకింది.
ఇదిలా ఉంటే తాజాగా అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలు ప్రజలను మరింత భయపెడుతున్నాయి. భారీ పరిమాణం ఉన్న ఉల్కలు భూమివైపుకు దూసుకొస్తున్నాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇవి గనక భూమి పడితే భారీ ఆస్తి, ప్రాణనష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఐదు ఉల్కలు భూమికి అతిసమీంలో దూసుకొస్తున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ ఉల్కలు పారిస్‌లోని ఈఫిల్ టవర్, ఈజిప్టులోని పిరమిడ్ కంటే భారీ సైజులో ఉండనున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
సెంట్రల్ ఫర్ నియర్ ఎర్త్ స్టడీస్ (సీఎన్‌ఈఓఎస్) అధ్యయనం ప్రకారం, రెండు భారీ పరిమాణంలో ఉన్న ఉల్కలు ఈ రోజు భూమి వైపు వస్తున్నాయి. ఈ రెండు ఉల్కలు భూమిని తాకినట్లయితే.. దీని ప్రభావం 25 నుంచి 50 మెగాటన్ అణు బాంబుతో సమానంగా ఉంటుందని సీఎన్‌ఈఓఎస్ పేర్కొన్నది. అయితే ఈ ఐదు ఉల్కలలో దేనికైనా భూమిని తాకే సంభావ్యత చాలా తక్కువగా ఉంటుంది. నాసా ప్రకారం, అన్ని ఆస్ట్రోయిడ్లు సురక్షితమైన దూరం నుంచి బయలుదేరుతాయి. ఇవాళ భూమి వైపునకు దూసుకువస్తున్న ఉల్క 62 మీటర్ల భారీ సైజులో ఉండి భూమి నుంచి 3.5 మిలియన్ కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అదే సమయంలో, 2016 లో కూడా పడిపోయిన ఒక ఉల్క సీఓ247 ఈఫిల్ టవర్ వలె భారీ సైజులో ఉన్నది.
నాసా ప్రకారం, ఈ ఆస్ట్రోయిడ్లన్నీ భారీగా ఉన్నప్పటికీ, అవి భూమికి దూరంగా ఉన్నందున ప్రమాదం తక్కువగా ఉండనున్నది. అంతరిక్షంలో కదలాడే శిలలవంటి పదార్థాలనే ఉల్కలు అంటారు. ఇవి భూమిమీదకు దూసుకొస్తే ప్రమాదం.