Begin typing your search above and press return to search.
ఉత్తర కొరియాలో భూకంపానికి కారణం అదేనట!
By: Tupaki Desk | 24 Sep 2017 9:08 AM GMTఉత్తర కొరియాలో భూకంపానికి కారణం అదేనట!ప్రపంచ దేశాలు వద్దు వద్దంటున్నావినకుండా.. వరుస అణు పరీక్షలు - క్షిపణి ప్రయోగాలతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్నాడు ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్. ఇతడి చేతిలో అణ్వాయుధాలు ఉండటం పిచ్చోడి చేతిలో రాయిలాంటిదని శత్రు దేశాలు అమెరికా - జపాన్ - దక్షిణ కొరియాలు అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కిమ్‌ను ఉద్దేశించి రాకెట్ మ్యాన్ గా పేర్కొనడం గమనార్హం. ఆ రాకెట్‌పైన కిమ్ కూర్చున్నాడని వ్యాఖ్యానించారు. తద్వారా కిమ్ తనకు తానే గొయ్యి తవ్వుకుంటున్నాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా జరుగుతున్న సంఘటనలు చూస్తే ట్రంప్ చెప్పింది నిజమేనని నమ్మక తప్పదు.
తాజాగా ఉత్తర కొరియాలో భూకంపం సంభవించింది. ఇదేదో సాధారణంగా జరిగింది కాదు. ఉత్తర కొరియా ఎక్కడైతే అణు పరీక్షలు జరిపిందో అక్కడ మాత్రమే భూమి కంపించిందని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. అనుమానాస్పద పేలుళ్లు సంభవించడం వల్లే భూకంపం వచ్చిందని చెబుతున్నారు. మరోవైపు ఉత్తర కొరియా వాదన మరోలా ఉంది. చైనా చేసిన వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. సహజంగానే భూకంపం వచ్చిందని కల్లబొల్లి కబుర్లు చెబుతుండటం గమనార్హం.
చైనా మాత్రం ఉత్తర కొరియా హైడ్రోజన్ అణు బాంబు పరీక్ష చేయడం వల్లే భూకంపం సంభవించిందని ఆరోపిస్తోంది. అమెరికా కూడా చైనా వాదనకే మద్దతు పలకడం గమనార్హం. అమెరికా భూగర్భశాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం న్యూక్లియర్ టెస్ట్ జరిపిన ప్రాంతానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే భూకంపం సంభవించిందట. 5.6 మాగ్నిట్యూడ్ తో మొదలైన భూకంపం 6.3 మాగ్నిట్యూడ్ వద్ద ముగిసిందని ఆ దేశ శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది.