Begin typing your search above and press return to search.

కుదిపేసిన భూకంపం..100మంది మృతి

By:  Tupaki Desk   |   6 Aug 2018 4:17 AM GMT
కుదిపేసిన భూకంపం..100మంది మృతి
X
డేంజర్ జోన్ లో ఉన్న ఇండోనేషియా దేశం మరోసారి భూకంప తాకిడికి అతలాకుతలం అయ్యింది. ఆ దేశంలోని లంబోక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టేర్ స్కేలుపై 7శాతంగా నమోదైన భూకంప తీవ్రతకు 100మందికి పైగా మృతిచెందారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం వచ్చాక కూడా కొన్ని గంటలపాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి ఏడుస్తూ వీధుల వెంట పరిగెత్తారు. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగిందని అధికారులు చెబుతున్నారు.

భూకంపం ధాటికి ఇండోనేషియాలో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇక భూకంప తీవ్రత 7కు పైగా ఉండడంతో సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు. పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం ఇండోనేషియా దేశంలోనే అత్యధిక భూకంపాలు వచ్చే ప్రాంతం.. ఇప్పుడు ఆజోన్ లోనే భారీ భూకంపం వచ్చింది. గత నెల 29న లంబోక్ లో భూకంపం వచ్చింది. ఆ ఉదంతంలో 17మంది చనిపోయారు. ఇప్పుడు మరో భారీ ఉత్పాతంతో 100మందికి పైగా అసువులు బాసారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తమయ్యారు.