Begin typing your search above and press return to search.
‘‘మణిపూర్ ’’ కదలిక ఈశాన్యానికి వణుకు
By: Tupaki Desk | 4 Jan 2016 5:01 AM GMTఈ మధ్యకాలంలో తరచూ భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఆప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని భూమి అడుగు పొరల్లో కదలికలు తరచూ చోటు చోసుకోవటంతో ఉత్తర భారతం ఈ మధ్య వణుకుతోంది. ఇందుకు భిన్నంగా సోమవారం ఉదయం ఈశాన్యం వణికింది. భారత్.. యమన్మార్ సరిహద్దులో తెల్లవారుజామున భూకంపం చోటు చేసుకుంది. అమెరికా సంస్థ లెక్క ప్రకారం.. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.8గా నమోదైంది.
తాజా భూకంపం కారణంగాగా పశ్చిమ బెంగాల్ మొదలు ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గాఢ నిద్రలో ఉన్న వేళ.. బలమైన శక్తి ఏదో ఊపేసినట్లుగా ఉగిపోవటంతో.. ఉలిక్కిపడిన ప్రజలు ఇళ్లల్లో నుంచి భయంతో బయటకు పరుగులు తీసే పరిస్థితి. తాజా భూ ప్రకంపనలతో ఈశాన్య భారతంలో కలకలం రేగింది.
తాజా భూకంప కేంద్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. తాజా భూప్రకంపనల కారణంగా ఒక వ్యక్తి మరణించారు. 20 మందికి పైగా గాయపడినట్లుగా సమాచారం. ఆస్తి నష్టం ఒక మోస్తరుగా జరిగిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.