Begin typing your search above and press return to search.
ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు!
By: Tupaki Desk | 16 Nov 2022 11:58 AM GMTఆంధ్ర ప్రదేశ్స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ఆందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. పది సెకన్ల పాటు భూమి కంపించడంతో ఏం జరిగిందో ప్రజలకు అర్థం కాలేదు. భూకంపం అని తెలియడంతో భయాందోళనల ఇళ్లను వదిలిపెట్టి బయటకు పరుగులు తీశారు.
చిత్తూరు జిల్లాలో పలమనేరు, గంట ఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు కనిపించాయి. 15 నిమిషాల వ్యవధిలోనే భూమి మూడుసార్లు కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ఇళ్లళ్లోని వస్తువులన్నీ కిందపడిపోయాయి. గోడలు స్వల్పంగా బీటలువారాయి. భయంతో అయా గ్రామాల ప్రజలు రాత్రంతా రోడ్ల పైనే గడిపారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. భూకంపానికి కారణాలను అన్వేషిస్తున్నారు.
కాగా, గతంలోనూ చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
కాగా చిత్తూరు జిల్లాలో గతంలోనూ భూకంపం సంభవించడం, ఇప్పుడు కూడా భూప్రకంపనలు రావడంపై అధికారులు కారణాలను తెలుసుకుంటున్నారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.