Begin typing your search above and press return to search.
దేశంలో భూకంపం: ఇయర్ ఎండింగ్ ఎఫెక్టేనా?
By: Tupaki Desk | 18 Dec 2020 5:08 PM GMT2020 ఇయర్ ముగింపు దశకు వచ్చింది. ఈ సంవత్సరం ఎన్నో విషాదాలు ప్రపంచవ్యాప్తంగా అలుముకున్నాయి. అన్నింటికంటే పెద్దది కరోనా మహమ్మారి ఎఫెక్ట్. కరోనాతో ఈ సంవత్సరం అందరికీ లేకుండా పోయింది. ఏడాది మొత్తం దాదాపు ఇంట్లోనే గడిపిన ప్రజలకు ఈ సంవత్సరాంతంలో కొత్త రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజాగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భూకంపాలు చోటుచేసుకున్నాయి. గురువారం ఢిల్లీ ఎన్సీఆర్ లో రాత్రి 11.45 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ప్రజలు భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా సంభవించింది.
ఢిల్లీ నుంచి గురుగ్రామ్ లోని నోయిడా ఘజియాబాద్ వరకు ప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. భూమికి 5 కి.మీ.ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా సిస్మోలజీ విభాగం వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భూకంపకేంద్రం తక్కువ దూరంలో ఉండడంతో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ నెల ఆరంభంలోనే గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 1.7 నుంచి 3.3 తీవ్రతతో 19 భూకంపాలు సంభవించాయి.జపాన్ లో అయితే ఈ ఇయర్ ఎండింగ్ లో భూకంపాలు భారీగా వస్తున్నాయి. కరోనాతో అల్లాడిపోతున్న జనం ఈ భూకంపాల ప్రభావాన్ని సోషల్ మీడియా వేదికగా ‘ఇయర్ ఎండింగ్’ ఎఫెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.