Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల విషయంలో కేంద్రం లౌక్యం
By: Tupaki Desk | 31 Oct 2016 9:14 AM GMTబీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా - వ్యూహాత్మకంగా తెలుగు రాష్ట్రాల విషయంలో వ్యవహరిస్తోందో తెలియజెప్పేందుకు అద్భుతమైన ఉదాహరణ ఇది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సులభ వాణిజ్య రాష్ట్రాల పేర్లను ప్రకటించే క్రమంలో సమతూకం పాటిస్తూ రెండు సర్కారులకు ఒక్కచోటు కట్టబెట్టింది. 98.78 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలు రెండూ సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నిర్మలా సీతారామన్ సారథ్యంలోని కేంద్ర వాణిజ్యశాఖ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. సులభతర వాణిజ్య విధానంలో 98.78 స్కోర్ తో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఉంది. మూడో స్థానంలో ఛత్తీస్ గఢ్ నిలిచింది. గతేడాది తెలంగాణ 13వ స్థానంలో నిలువగా 12 స్థానాలు మెరుగుపడి ఈ యేడాది తెలంగాణ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ గత ఏడాది రెండో స్థానంలో ఉండగా ఈ ఏడాది మొదటి స్థానం దక్కించుకుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/