Begin typing your search above and press return to search.

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ : టాప్‌లో బెంగళూరు..ఏపీ నుండి నగరాలకు చోటు !

By:  Tupaki Desk   |   4 March 2021 12:36 PM GMT
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ : టాప్‌లో బెంగళూరు..ఏపీ నుండి   నగరాలకు చోటు !
X
ఏపీలో త్వరలో మున్సిపాలిటీలకి , కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ మున్సిపాలిటీల జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాలు, మున్సిపాలిటీలతో కూడిన జాభితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టాప్-10లోఏపీలోని మూడు నగరాలకు చోటు లభించింది. తెలంగాణలోని ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గానీ, మున్సిపాలిటీ గానీ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కొద్ది సేపటి కిందటే దేశ రాజధానిలో ఈ జాబితాను విడుదల చేశారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ పేరుతో కేంద్రమంత్రి రెండు వేర్వేరు జాబితాలను విడుదల చేశారు.

ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌ల.. నివాసానికి అనుకూలంగా ఉన్న నగరాల పేర్లను చేర్చారు. మళ్లీ వాటిని రెండు విభాగాలుగా చేశారు. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలను ఒక కేటగిరీలో.. 10 లక్షల కంటే తక్కువగా జనాభా ఉన్న సిటీలను మరో కేటగిరీలోకి చేర్చారు. మొదటి కేటగిరీలో రాష్ట్రంలో ఏ ఒక్క నగరానికి కూడా చోటు దక్కలేదు. మిలియన్‌కు(10 లక్షల) పైగా జనాభా ఉన్న నగరాల్లో బెంగ‌ళూరు మొదటి స్థానంలో నిలవగా.. ఆ త‌రువాతి స్థానాల్లో పుణె, అహ్మ‌దాబాద్ ఉన్నాయి. అయితే 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖ ఉంగా హైదరాబాద్‌ 24వ స్థానంలో నిలిచింది. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకుల్ని కేటాయిస్తుంటారు. ఇదే కేటగరీలో అంటే టాప్‌ టెన్ ‌లో బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై ఉన్నాయి.

ఇక ఒక మిలియన్‌లోపు జనాభా ఉన్న నగరాల్లో షిమ్లా తొలిస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వస్సా, కాకినాడ , సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్‌గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి. 2020లో జరిగిన ఈ సర్వేలో 111 నగరాలు పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకుల్ని కేటాయిస్తున్నట్టు పీఐబీ తెలిపింది. మరోవైపు మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మిలియన్ ప్లస్ కేటగరీలో ఇండోర్ టాప్‌లో ఉండగా..సూరత్, భోపాల్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మిలియన్ లోపు జనాభా ఉన్న కేటగరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ టాప్‌లో ఉండగా.. తిరుపతి, గాంధీనగర్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో విశాఖపట్నం, తిరుపతిలు టాప్-10లో నిలిచాయి. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల జాబితాలో విశాఖ తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది.