Begin typing your search above and press return to search.
తూర్పున జగన్ వికాసం
By: Tupaki Desk | 2 Aug 2018 11:37 AM GMTఉభయ గోదావరి జల్లాలలో రెట్టించిన ఉత్సాహంతో వై.ఎస్. జగన్ మోహాన రెడ్డి పాదయాత్ర ముగింపునకు వచ్చింది. ఈ రెండు జిల్లాలలోను యాత్రలో కాస్త వివాదాస్పదమైనా - ఒక విధంగా చెప్పాలంటే పాదయాత్ర విజయవంతమైనట్లే. రెండు జిల్లాలలోను అన్నీ వర్గాల ప్రజలను జగన్ ఆకర్షించారు. కాపులకు రిజర్వేషన్ విషయంలో కాస్త ఇబ్బంది ఎదురైన జగన్ చేసిన ప్రకటన సాహసవంతమైనదిగా గుర్తించారు. తనకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయలేనని ఆయన మరోసారి నిరూపించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు జగన్ పట్ల నమ్మకం పెరిగింది. తొలుత కాపులు జగన్ ప్రకటనను వ్యతీరేకించినా ఆయన నిర్ణయంలోని నిజాయితికి మాత్రం జేజేలు కొట్టారు. ఈ స్ఫూర్తితో జగన్ తూర్పు జిల్లాలకు ముఖద్వారమైన విశాఖలో అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే పలుమార్లు తూర్పు జిల్లాలైన శ్రీకాకుళం - విజయనగరం - విశాఖపట్నం జిల్లాలలో జగన్ పర్యాటించారు.
గత ఎన్నికలలో విశాఖపట్నం లోక్ సభ నియోజకవర్గం నుంచి జగన్ తల్లి విజయమ్మ పోటి చేసారు. ఆ ఎన్నికలో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల పొత్తు వల్ల ఆమె ఓటమి చెందారు. అయితే ఈ సారి పరిస్థితులు మారాయి. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనతో విశాఖ ప్రజలు విసిగిపోయారు. అలాగే కేంద్రంలో బిజేపి పాలన పట్ల కూడా వ్యతిరేకతతో ఉన్నారు. ఇది వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు అనుకూలించే అంశం. దీంతో పాటు జగన్ చేస్తున్న పాదయాత్ర కూడా పార్టీకి కలిసోస్తుందని ఓ అంచనా. ఇంతకుముందు విశాఖ జిల్లాలో ఏ సందర్భంలో జగన్ పర్యాటించినా ప్రజలు జేజేలు పలికారు. ఇప్పుడు కూడా అదే వాతవరణం ఉంటుందని అంటున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు. కాపు రిజర్వేషన్లలాగే రైల్వే జోన్ కూడా కేంద్రం పరిధిలోనిది. ఈ విషయం విశాఖ ప్రజలకు తెలుసు. అయితే తాను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచైన రైల్వే జోన్ తీసుకు వస్తానని జగన్ చెప్పే అవకాశం ఉంది.
అలాగే విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు - శాసన సభ్యుల అవినీతిపై కూడా జగన్ ప్రశ్నించనున్నారు. విశాఖలో జరిగిన భూకుంభకోణంపై తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తానని హామీ ఇవ్వనున్నారు. స్థానిక సమస్యలపై పాదయాత్ర వేదికగా పరిష్కారం చూపిస్తానని జగన్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో సహజంగానే సౌమ్యూలైన తూర్పు ప్రజలు జగన్ వైపు అడుగులు వేసే అవకాశం ఉంది. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఎక్కువయింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు - గంటా శ్రీనివాసుల మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోంది. జల్లాలో మిగిలిన ఎంఎల్ ఎలు కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా లేరు. ఇవన్నీ వైఎస్ ఆర్ కాంగ్రెస్‌కు కలసి వచ్చే అంశాలు.