Begin typing your search above and press return to search.
బీఫ్ మీ దేశంలో తినండి...ఇక్కడ కాదు
By: Tupaki Desk | 8 Sept 2017 6:00 PM ISTదేశంలో మరోమారు బీఫ్ కలకలకం వార్తలు తెరమీదకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి చేసిన మంత్రివర్గ విస్తరణలో టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి అల్ఫోన్స్ కన్ననథానం తాజాగా ఈ వివాదానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. భువనేశ్వర్ లో జరిగిన ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేషన్స్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బీఫ్ తినవద్దని, తినకూడదని బీజేపీ ఎన్నడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ పర్యటనకు వచ్చే విదేశీ టూరిస్టులకు బీఫ్ విషయంలో ఒక సూచన చేశారు.
ఎవరి ఆహారపు అలవాట్లను తాము వద్దని చెప్పడం లేదని మంత్రి అల్ఫోన్స్ కన్ననథానం అన్నారు. అయితే బీఫ్ తినాలంటే మీ దేశంలో తినండి ఇక్కడ కాదు అని పేర్కొన్నారు. మీ దేశంలో బీఫ్ తినండి ఆ తరువాత మా దేశం రండి అని కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చారు. ``బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాలో బీఫ్ తింటున్నారు. కేరళలో కూడా అలాంటి సంప్రదాయం ఉంది. ఎవరి ఆహారపు అలవాట్లపై కూడా మేం ఒత్తిడి చేయడం లేదు`` అని స్పష్టం చేశారు. భారతదేశంలో పురాతన కుటుంబ వ్యవస్థ మనుగడలో ఉందని పేర్కొంటూ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి...అందుకు ఇక్కడికి వచ్చి చూడండి సందర్శించడం అని కేంద్ర మంత్రి వివరించారు.