Begin typing your search above and press return to search.

బిగ్‌ బ్రేకింగ్‌ - ఏపీ సీఎస్‌ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం

By:  Tupaki Desk   |   5 April 2019 5:18 PM GMT
బిగ్‌ బ్రేకింగ్‌ - ఏపీ సీఎస్‌ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం
X
ఎన్నికల వేళ ఏపీలో భారీ బదిలి జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ అనిల్‌ చంద్రా పునేఠాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నూతన సీఎస్‌ గా ఎల్‌ వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎల్‌ వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌ గా కొనసాగనున్నారు.

ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఏబీ వెంకటేశ్వర్రావు బదిలీని పునేఠా అడ్డుకున్న సంగతి తెలిసిందే. అంతేగాక.. ఇంటిలిజెన్స్‌ అనేది ఈసీ పరిధిలోకి రాదు అంటూ పుమేఠా జీవో కూడా ఇచ్చారు. అయితే.. ఇదంతా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే జరిగింది అనేది అందరికి తెలిసింది. కానీ వేటు మాత్రం పునేఠాపై పడింది. ఎన్నికల వేళ.. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని అభిప్రాయపడిన ఎన్నికల కమిషన్.. పునేఠాను సీఎస్‌గా తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించింది.

1983 బ్యాచ్‌కు చెందిన ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉదయం 10 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. వైఎస్‌ హయాంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం చాలా కీలక పోస్టుల్లో పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన టీడీపీ ఈవోగా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు ఏపీ సీఎస్‌ గా నియమిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టులో నియమించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.