Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు ఈసీ ఇచ్చిన మొట్టమొదటి షాక్!
By: Tupaki Desk | 3 Oct 2018 5:56 PM GMTటీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ముందస్తు ఎన్నికలకు దూకుడుగా సాగుతున్న గులాబీ దళపతి ఎన్నికలకు ముందే పలు ప్రజాకర్షక పథకాలను అమల్లో పెట్టేశారు. వాటి భరోసాతోనే ముందస్తుకు పోతున్నారనే టాక్ కూడా పలు వర్గాల్లో ఉంది. ఇలా వివిధ లెక్కలతో ఆయన ఎన్నికలకు వెళితే...ఆదిలోనే కేసీఆర్ కు నచ్చిన పథకానికి ఈసీ బ్రేకులు వేసింది. బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ నిరాకరించింది. ఈసీ నిర్ణయంతో బతుకమ్మ చీరల పంపిణీ నిలిచిపోనుంది.
పండుగలోగా కోటి చీరాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్ర చేనేత జౌళి శాఖ చీరలను సిద్ధం చేసి ఉంచింది. ఇటీవల మంత్రి కేటీఆర్ చీరలను మీడియాకు ప్రదర్శించారు. ఈనెల 9 నుండి బతుకమ్మ పండుగ సంబరాలు జరగనున్నాయి. అప్పటి నుంచి చీరల పంపిణీకి సర్కారు రెడీ అయింది. అయితే, కోడ్ అమల్లో ఉన్నందున చీరలు పంపిణీ చేయకూడదని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఆర్ ఎస్ కు మైలేజీ కల్పించే కీలక పథకంపై సందేహాలు కమ్ముకున్నాయి. ఇదిలాఉండగా...బతుకమ్మ చీరల పంపిణీ నిలుపుదలతో రైతుబంధు చెక్కుల పంపిణీతో సందిగ్ధంలో పడింది. ఇప్పటికే 50 లక్షల మందికి ఎకరానికి 4వేల చొప్పున అందివ్వడానికి 6000 కోట్ల రూపాయలతో సర్కార్ సిద్ధంగా ఉంది. అయితే, ఈ పథకంపై కూడా బతుకమ్మ వంటి ఎఫెక్ట్ పడనుందని అంటున్నారు.