Begin typing your search above and press return to search.
నల్లగొండలో ఈసీ కొరడా... 576 మంది నేతల పదవులు గోవిందా
By: Tupaki Desk | 26 March 2021 2:30 AM GMTఎన్నికలంటే... ఏదో అలా పోటీ చేశాం. చేతిలో ఉన్నంత మేర ఖర్చు చేశాం. ఎలాగోలా గెలిచేశాం. గెలుపు సంబరాలు చేసుకున్నాం. ఇంకేముంది? అంతా అయిపోయింది కదా అనుకుంటే కుదరదు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు నడుచుకోకపోతే.. ఏం జరుగుతుందన్న విషయం నల్లగొండ జిల్లా నేతలకు ఇప్పుడు తెలిసి వచ్చిందనే చెప్పాలి. ఎన్నికల్లో పోటి చేసి విచ్చలవిడిగా ఖర్చు చేసి... ఏదేదో కారణాలు చెబుతూ ఆ ఖర్చుల వివరాలను అందించకుండా సాకులు చెబుతూ సాగుతున్న 576 మంది నేతలపై ఇప్పుడు ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. కేవలం ఖర్చులు చెప్పని కారణంగానే వీరందరినీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లుగా ఎన్నికల సంఘం చేసిన ప్రకటన ఇప్పుడు నిజంగానే సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది. మొత్తంగా ఎన్నికల ప్రక్రియలో గెలిచిన అభ్యర్థులతో పాటు ఎన్నికల బరిలోకి దిగేందుకు ఎప్పుడెప్పుడా అని ఉవ్విళ్లూరుతున్న వారందరూ ఇకపై తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందేనన్న కోణంలో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు నల్లగొండ జిల్లాలో ఎన్నికల సంఘం ఏ రీతిన వ్యవహరించిందన్న వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 837 పంచాయతీలకు 2019 జనవరిలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. పోటీచేసిన అభ్యర్థులంతా మూడు నెలల్లో ఎన్నికల్లో ఖర్చు చేసిన వ్యయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై ఎన్నికల సంఘం ఖర్చు వివరాల నివేదికను కోరినా చాలామంది స్పందించలేదు. ఖర్చుల వివరాలు సమర్పించని వారికి ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. అయినా, వారు పెడచెవిన పెట్టని వైనాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. నోటీసులకు స్పందించని వారందరూ పదవులు కోల్పోతున్నట్లు సంచలన ప్రకటన చేసంది. ఇలా పదవులు కోల్పోయిన వారిలో 42మంది ఉప సర్పంచ్‌లు, 534మంది వార్డు సభ్యులు... మొత్తంగా 576 మంది ఉన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఒక్క నల్లగొండ జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇదిలా ఉంటే... ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన కొందరు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఖర్చుల వివరాలు సమర్పించారు. ఖర్చులు చెప్పని వారికి నోటీసులు జారీ చేసినా కూడా వారు సకాలంలో స్పందించకపోవడంతోనే అనర్హత వేటు వేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. మరికొందరు అభ్యర్థులు ఎన్నికల వ్యయం లెక్కలు ఎలా సమర్పించాలో తెలియదని చెబుతుండగా, ఇంకొందరు తమకు నోటీసులు అందలేదని పేర్కొంటున్నారు. ఈ విషయంపై అనర్హత వేటుకు గురైన అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు స్పందించని కారణంగానే వారిపై అనర్హత వేటు వేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. మరి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులపై అనర్హత వేటు పడితే... ఆ స్థానాలను భర్తీ చేయడమెలా అన్న అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అనర్హత వేటుకు గురైన 576 వార్డు సభ్యుల స్థానాలతో పాటు ఏడుగురు సభ్యులు మృతిచెందిన స్థానాలు... మొత్తంగా 583 వార్డులకు ఎన్నికల సంఘం తిరిగి ఎన్నికలు నిర్వహించనుంది. ఉప సర్పంచ్‌లు అనర్హత వేటుకు గురైన పంచాయతీల్లో కోరం ఉంటే మరో సభ్యుడిని ఎన్నుకుని ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. కోరం లేని పంచాయతీల్లో సర్పంచ్‌తో పాటు సంబంధిత అధికారికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి పేర్కొన్నారు. మొత్తంగా కేవలం ఖర్చులు చెప్పని వైనంతో ఇలా వందల మంది పంచాయతీ ప్రతినిధులు అనర్హతకు గురైన వైనం ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు పాటించకపోతే ఏమవుతుందన్న విషయం అందరికీ అర్థమయ్యేలా ఎన్నికల సంఘం చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.