Begin typing your search above and press return to search.
అమ్మ వీడియోపై ఈసీ సీరియస్..
By: Tupaki Desk | 20 Dec 2017 10:16 AM GMTఅమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కు సరిగ్గా ఒక్క రోజు ముందు శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు విడుదల చేసిన అమ్మ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అమ్మ అనారోగ్యం.. ఆపై అపోలో ఆసుపత్రికి తరలింపు.. అక్కడేం జరిగిందన్న అంశంపై చాలానే సందేహాలు ఉన్నాయి. దీనిపై పలు వాదనలు ప్రచారంలో ఉన్నాయి.
అమ్మ మరణంపై నెలకొన్న ఆరోపణల నేపథ్యంలో విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీని ముందు హాజరైన పలువురు ఇప్పటికే సంచలన విషయాలు వెల్లడించారు. అమ్మకు వైద్య సాయం అందించేందుకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన వైద్యులను సైతం అపోలో ఆసుపత్రిలో అమ్మను చూడనివ్వలేదని చెప్పటం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ రేపు (గురువారం) జరగనుంది.
ఉప ఎన్నిక బరిలో అన్నాడీఎంకే.. శశికళ వర్గానికి చెందిన అభ్యర్థి దినకరన్ తో పాటు.. డీఎంకే తదితర పార్టీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా అమ్మ మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ తమను దెబ్బ తీస్తున్న పళని.. పన్నీరు జోడికి దిమ్మ తిరిగే షాకిచ్చేలా.. వారు చెప్పే మాటల్లో నిజం లేదనిపించేలా శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేవెట్రివేల్ అపోలో ఆసుపత్రిలో అమ్మ మామూలుగా ఉన్న వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో అమ్మ డ్రింక్ తాగుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోను పరిశీలిస్తున్నట్లుగా అపోలో ఆసుపత్రి ప్రకటించింది. ఇదిలా ఉంటే.. అమ్మ వీడియో విడుదలపై క్లారిటీ ఇచ్చిన వెట్రివేల్.. ఆసుపత్రికి తరలించే నాటికి అమ్మ స్పృహలో లేదని.. అమ్మ మరణం తర్వాత నాటకం ఆడినట్లుగా జరుగుతున్న ప్రచారం తప్పన్న విషయాన్ని చెప్పేందుకే తాను వీడియో విడుదల చేసినట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. ఈ వీడియో విడుదలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా వీడియో విడుదల చేయటం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పేర్కొంది. వీడియోను విడుదల చేసిన ఎమ్మెల్యే వెట్రివేల్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. పోలింగ్ కు ఒక్కరోజు ముందు వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని చెప్పింది.
అమ్మ మరణంపై తమ మీద వేస్తున్న నిందలు నిజం కావన్న సందేశాన్ని ఇచ్చేలా.. తప్పుడు ప్రచారం చేస్తూ అమ్మ మరణాన్ని రాజకీయం చేసి లబ్థి పొందాలని భావిస్తున్నారన్న భావన కలిగేలా తాజా వీడియో రిలీజ్ ఉందని చెప్పొచ్చు. ఏమైనా.. వీడియో విడుదలతో తమిళ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.