Begin typing your search above and press return to search.
జాకీల సంగతి తర్వాత.. ఈ షాక్ ను షర్మిల అస్సలు ఊహించి ఉండరు
By: Tupaki Desk | 12 Jan 2022 4:30 AM GMTతన తండ్రి రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న సంకల్పంతో.. అందరి అంచనాలకు భిన్నంగా పార్టీ పెట్టిన షర్మిల.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు. తనకేమాత్రం అవకాశం లేని తెలంగాణలో ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించటానికి ముందు.. తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఆమెకు టచ్ లోకి రావటం ఆసక్తికరంగా మారాయి. అయితే.. ఆమె పొలిటికల్ ఎంట్రీకి తెలంగాణ సమాజం స్పందించింది అంతంతమాత్రమేనని చెప్పాలి. దివంగత మహానేత వైఎస్ మీద తెలంగాణ ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వైఎస్ మోకాలు ఒడ్డారన్న భావనలో అయితే ఉన్నారు.
దీనికి తోడు షర్మిల అన్నంతనే ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. ఆమె కావటానికి తెలంగాణ కోడలు అయినప్పటికీ.. పార్టీ ఏర్పాటు వేళలోనే.. ఈ సెంటిమెంట్ పాయింట్ ను బయటకు తీశారే తప్పించి.. ఇంతకు ముందెప్పుడు ఆ విషయాన్ని హైలెట్ చేసింది లేదు. దీనికి తోడు.. ఏపీలో జగన్ పాలన తీరుపై నెలకొన్న ఫీడ్ బ్యాక్.. షర్మిల మాట్లాడే మాటకు కౌంటర్ ఇచ్చేలా మారింది. మొత్తంగా ఎంత ప్రయత్నించినా తెలంగాణలోఆమె సానుకూల పరిణామాన్ని తీసుకురాలేకపోతున్నారు.
చివరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ పాదయాత్ర.. కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. పాదయాత్రకు బయలుదేరిన షర్మిలకు.. జనాల ఆదరణతో పాటు మీడియాలోనూ ఆమె వార్తల్ని కవర్ చేసే ప్లేస్ అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రజల్లో పట్టు లేని వేళ.. పత్రికల్లోనూ.. మీడియాలోనూ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వటం కష్టమే. ఇలా పుట్టెడు కష్టాలతో కిందా మీదా పడుతున్న షర్మిలకు.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఊహించని షాక్ ఎదురైనట్లు చెబుతున్నారు. తమ పార్టీ అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ)ని ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు అడ్డంకులు ఎదురైనట్లు చెబుతున్నారు.
వైఎస్ ఆర్టీపీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నపార్టీకి అభ్యంతరాలు వచ్చినట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే తెలంగాణలో ‘‘అన్న వైఎస్ ఆర్’’ పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన వారు..షర్మిల కొత్త పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ పేరుకు వైఎస్ ఆర్టీపీ పేరు పోలి ఉందంటూ ఎన్నికల కమిషన్ కు అన్న వైఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ భాషా నవంబరులోఈసీకి ఫిర్యాదు చేశారు.
ఆయన కంప్లైంట్ ను స్వీకరించిన ఈసీ.. తాజాగా వైఎస్ ఆర్టీపీకి లేఖ రాసింది. దీంతో.. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ఈసీ అడిగిన వివరణకు షర్మిల ఏమని బదులిస్తారు? దీనికి ఈసీ ఎలా రియాక్టు అవుతుందన్నది ప్రశ్నగా మారింది. పార్టీకి ప్రజల్లో పట్టు లేకున్నా ఫర్లేదు.. ఏదోలా జాకీలు వేసి లేపుదామన్న ఆలోచనలో ఉన్న షర్మిలకు.. ఈసీ నుంచి ఎదురుకానున్న ఈ కొత్త సవాలును ఆమె ఏ రీతిలో డీల్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.