Begin typing your search above and press return to search.

ఫ‌ణి ఎఫెక్ట్‌!... ఏపీలో 4 జిల్లాల్లో కోడ్ ఎత్తివేత‌!

By:  Tupaki Desk   |   3 May 2019 12:31 PM GMT
ఫ‌ణి ఎఫెక్ట్‌!... ఏపీలో 4 జిల్లాల్లో కోడ్ ఎత్తివేత‌!
X
టీడీపీ అదినేత నారా చంద్ర‌బాబునాయుడు ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో మార్చి చివ‌ర‌లోనే అమ‌ల్లోకి వ‌చ్చిన ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో ప్రజా ప్ర‌భుత్వాలేమీ కూడా సాధార‌ణ స‌మీక్ష‌లే కాకుండా కొత్త‌గా ఏ నిర్ణ‌య‌మూ తీసుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగం ద్వారా ద‌ఖ‌లు ప‌డిన ఈ విశేషాధికారాల నేపథ్యంలోనే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికే ఇప్పుడు ఫైన‌ల్ అని చెప్పాలి. దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చిన నాటి నుంచి అమ‌ల్లో ఉంటూ వ‌స్తున్న ఈ నిర్ణ‌యాల‌ను కాద‌ని ఇప్పుడు చంద్ర‌బాబు అండ్ కో... ఎన్నిక‌ల కోడ్ పై త‌మ‌దైన శైలి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అదేదో త‌మ‌కు మాత్ర‌మే కోడ్ వ‌ర్తిస్తున్న‌ట్లుగా చంద్ర‌బాబు చేస్తున్న వాద‌న కూడా వింత‌గానే ఉందని చెప్పాలి.

ఈ క్ర‌మంలో ఫ‌ణి తుఫాను రూపంలో ఓ పెద్ద ఉప‌ద్ర‌వ‌మే ఇప్పుడు ముంచుకొచ్చేసింది. ఒడిశాతో పాటు ఏపీలోని ఉత్తాంధ్ర‌లోని కొంత ప్రాంతంపై పెను ప్ర‌భావాన్న చూప‌నున్న ఈ తుఫాను కార‌ణంగా ఇప్ప‌టికే ఒడిశాలో మోడ‌ల్ కోడ్ ఆఫ్ కాండ‌క్ట్ ను ఈసీ ఎత్తేసింది. అయితే ఏపీకి కూడా ఆ ప్ర‌భావం ఉంది క‌దా... మ‌రి ఇక్క‌డి ప‌రిస్థితి ఏమిట‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్నిక‌ల సంఘానికి విన‌తి ప‌త్రం రాయాల్సిన చంద్ర‌బాబు... ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తే ఫ‌లితం ఏముంటుంది?. ఈ విష‌యం చంద్ర‌బాబుకు కాస్తంత ఆల‌స్యంగా బోధ‌ప‌డిన‌ట్టుంది.

నిన్న మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఏపీపైనా ఫ‌ణి తుఫాను ప్ర‌భావం ఉంద‌ని, ఈ కార‌ణంగా కోడ్ ను ఎత్తివేయాలంటూ చంద్ర‌బాబు ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖ‌ను ప‌రిశీలించిన ఈసీ.. ఏపీలోని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన నాలుగు జిల్లాల్లో కోడ్ ను ఎత్తివేస్తూ నిన్న రాత్రికే నిర్ణ‌యం తీసుకుంది. ఈసీ నిర్ణ‌యంతో ఫ‌ణి తుఫాను ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే శ్రీ‌కాకుళం జిల్లాతో పాటు విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్ట‌ణం, తూర్పుగోదావ‌రి జిల్లాల్లో ఎన్నిక‌ల కోడ్‌ను ఎత్తివేశారు.