Begin typing your search above and press return to search.
ఈసీ మోదీ పక్షపాతే!..ఇదిగో నిదర్శనం!
By: Tupaki Desk | 26 April 2019 10:18 AM GMTకేంద్ర ఎన్నికల సంఘం... ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక అధికారాలు కలిగిన సంస్థ. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే... ప్రజలు తమ నిర్ణయాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. అలా ప్రజలు తమ మనసులోని భావనను ఏమాత్రం ప్రభావితం కాకుండా చెప్పేందుకు దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాన్ని గుర్తించిన మన రాజ్యంగ నిర్మాతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ప్రజల తీర్పును నిగ్గుతేల్చేందుకు గాను... ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రభావం ఆ సంస్థపై లేకుండా చూసేందుకే ఎన్నికల వేళ ఈసీకి సర్వాధికారాలు దఖలుపరిచారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందే తడవు... ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే... ఇక అటు ప్రభుత్వం గానీ - ఇటు విపక్షం గానీ - ఏ ఒక్క రాజకీయ పార్టీ గానీ కిమ్మనకుండా ఉండాల్సిందే. ఈసీ నిర్ణయమే ఫైనల్. ఇదీ లెక్క.
అయితే ఈ దపా సార్వత్రిక ఎన్నికలు అలా జరుగుతున్న భావన కలగడం లేదు. ఇందుకు చాలా నిదర్శనాలే కనిపిస్తున్నాయి. వాటిలో అసలు సిసలు నిదర్శనం ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల ప్రచారానికి వచ్చే ఏ నేతను అయినా రిటర్నింగ్ అధికారుల ఆదేశాలతో పోలీసులు తనిఖీలు చేస్తారు. ఇలా ప్రధాని మోదీ మొన్నామధ్య ఒడిశాకు వెళ్లిన సమయంలో ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ను అక్కడి ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహిసిన్ తనిఖీ చేశారు. దీనిపై మోదీ కన్నెర్రజేయగా... అందుకు అనుగుణంగానే ఈసీ కూడా చర్యలు చేపట్టింది. మొహిసిన్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ తనపై తీసుకున్న చర్యను మోహిసిన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్) లో సవాల్ చేశారు. మొహిసిన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ట్రిబ్యూనల్... మొహిసిన్ సస్పెన్షన్ పై స్టే విధించింది. అంతేకాకుండా... మొహిసిన్ పై చర్యలు తీసుకున్న ఈసీతో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. మొహిసిన్ పై చర్యలకు కారణంగా ఈసీ ఏం చెప్పిందన్న విషయానికి వస్తే... ప్రధానికి ఎస్పీజీ భద్రత ఉందని, అలాంటి భద్రత ఉన్న నేతలను తనిఖీ చేయడం సరికాదని ఈసీ వాదిస్తోంది. అయితే క్యాట్ ఇక్కడ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించింది. కర్ణాటక సీఎం కుమారస్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వాహనాలను సైతం అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని క్యాట్ ప్రశ్నించింది. సరే... వారికి ఎస్పీజీ భద్రత లేకపోయినా... వారు కూడా తమ రాష్ట్రాలకు సీఎంలుగా వ్యవహరిస్తూ అత్యున్నత స్థాయి భద్రతలో కొనసాగుతున్న వారే కదా.
ఇదిలా ఉంటే... క్యాట్ స్టేతో మొహిసిన్ పై మరింత కఠిన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన సస్పెన్షన్ పై క్యాట్ స్టే ఇచ్చిన కొద్దిసేపటికే ఈసీ మొహిసిన్ ఎన్నికల విధులు నిర్వహించకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఆయన ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కర్ణాటక సర్కారుకు ఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా క్యాట్ నుంచి ఉపశమనం లభించిందన్న సంతోషం మొహిసిన్ కు లభించలేదన్న మాట. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే... ఈసీ ఈ ఎన్నికల్లో మోదీ పక్షపాత వైఖరితోనే ముందుకు సాగుతోందన్న విపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరినట్టేనన్న వాదన వినిపిస్తోంది.