Begin typing your search above and press return to search.

పోస్టల్ బ్యాలెట్ కు మంగళం పాడేలా కీలక ప్రతిపాదన చేసిన ఈసీ

By:  Tupaki Desk   |   22 Sep 2022 7:14 AM GMT
పోస్టల్ బ్యాలెట్ కు మంగళం పాడేలా కీలక ప్రతిపాదన చేసిన ఈసీ
X
ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ వేళ.. ఎన్నికల విధుల్లో ఉండే వారు తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితి గురించి తెలిసిందే. ఇలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవటం తెలిసిందే. అయితే.. ఈ విధానంలో పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురి అవుతుందన్న మాట తరచూ వినిపిస్తోంది.

ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ విధానానికి మంగళం పాడేలా కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త విధానాన్ని తెర మీదకు తెచ్చేందుకు వీలుగా కొత్త ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చింది.

పారదర్శకంగా.. నిప్పక్ష పాతంగా ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి చెక్ పెట్టేలా కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు అనుసరిస్తున్న పోస్టల్ బ్యాలెట్ విధానానికి బదులుగా ఓటర్ ఫెసిలిటటేషన్ సెంటర్ల వినియోగానికి సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖకు ఈసీ పంపింది.

ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనను సవరణ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్.. ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్రపాండేలు సూచన చేసినట్లుగా చెబుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునే ఓటర్ల సంఖ్య దగ్గర దగ్గర కోటి మంది వరకు ఉంటారు. వీరంతా ఎన్నికల్లో డూటీలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారాతమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. తాజా ప్రతిపాదనలో తమ ఎన్నికల విధులకు వెళ్లాల్సిన దాని కంటే ముందే ఓటు వేసేందుకు వీలుగా ఫెసిలిటేషన్ సెంటర్స్ ను ఏర్పాటు చేశారు.

ఈ కొత్త ఏర్పాటుతో ఓటు దుర్వినియోగం కాకుండా వీలుంటుందన్న ఆలోచనతో ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. సరికొత్త విధానం తెర మీదకు వచ్చినట్లే అవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.