Begin typing your search above and press return to search.
తెలంగాణలో మరో ఎన్నిక!..5 నెలల్లో మూడోది!
By: Tupaki Desk | 20 April 2019 1:53 PM GMTనిజంగానే తెలంగాణలో ఐదు నెలలుగా ఎన్నికల కోలాహలం కొనసాగుతూనే ఉంది. గతేడాది నవంబర్ లో మొదలైన ఈ కోలాహలం.. వచ్చే నెల (మే) నెలాఖరున ముగియనుంది. అంటే మొత్తంగా గడచిన నాలుగు నెలలతో పాటు వచ్చే నెల కూడా తెలంగాణలో ఎన్నికల కోలాహలమే. డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... ఈ నెల 11న లోక్ సభ ఎన్నికలు జరిగాయి. తాజాగా వచ్చే నెల స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దం అయిపోయింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో స్థానిక సంస్థల(మండల పరిషత్ - జిల్లా పరిషత్) ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. వచ్చే నెల 6న తొలి దశ పోలింగ్ జరగనుండగా - రెండో దశ పోలింగ్ మే 10న - మూడో దశ పోలింగ్ మే 14న జరగనుంది. మూడు దశల పోలింగ్ ముగిసిన తర్వాత మే 27 కౌంటింగ్ జరుగుతుంది. అంటే 5 నెలల్లో జరగనున్న మూడో ఎన్నిక మే నెలాఖరుతో ముగియనుందన్నమాట. ఈ మేరకు మూడు దశలకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి కాసేపటి క్రితం విడుదల చేశారు.
రాష్ట్రంలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు - 539 జెడ్పీస్థానాలు ఉన్నాయని నాగిరెడ్డి పేర్కొన్నారు. 47 ఎంపీటీసీ స్థానాలతో పాటు - మంగపేట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక నిర్వహించడం లేదని ఆయన వెల్లడించారు. ఇక ఈ ఎన్నికలకు సంబంధించిన కోడ్ కూడా నేటి నుంచి అమలులోకి వచ్చేసినట్టుగా ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించామని పేర్కొన్న ఆయన... ఈ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయని చెప్పారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్ పేపర్ - గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్ పేపర్లు ఉంటాయని తెలిపారు.
మూడు దశల ఎన్నికల షెడ్యూల్ ఇలా...
తొలి దశలో(197 జెడ్పీటీసీలు..2166 ఎంపీటీసీలు స్ధానాలు)
నామినేషన్: ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 24 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 25న
ఫిర్యాదులు: ఏప్రిల్ 27
నామినేషన్ ఉపసంహరణ: ఏప్రిల్ 28 వరకు
పోలింగ్: మే 6న
రెండో దశ(180 జెడ్పీటీసీలు..1913 ఎంపీటీసీలు స్ధానాలు)
నామినేషన్: ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28 వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 29న
ఫిర్యాదులు: మే 1న
నామినేషన్ ఉపసంహరణ: మే 2 వరకు
పోలింగ్: మే 10న
మూడో దశ(161 జెడ్పీటీసీలు..1738 ఎంపీటీసీలు స్ధానాలు)
నామినేషన్: ఏప్రిల్ 30 నుంచి మే 2 వరకు
నామినేషన్ల పరిశీలన: మే 3న
ఫిర్యాదులు: మే 5న
నామినేషన్ ఉపసంహరణ: మే6 వరకు
పోలింగ్: మే 14
మూడు దశలు పూర్తి అయిన తర్వాత సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత మే 27న ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.