Begin typing your search above and press return to search.
ఈసీ సంచలనం: మోడీ ఫొటో తొలగించాలని ఆదేశాలు
By: Tupaki Desk | 11 March 2021 1:30 PM GMTదేశంలోని కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. పోటీపోటీ పంచులతో వాతావరణం వేడెక్కుతోంది.ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై నరేంద్రమోడీ ఫొటోలు ప్రచురిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది.ఈ నేపథ్యంలోనే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో మోడీ ఫొటోను తొలగిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా గురువారం నిర్ణయం తీసుకుంది.