Begin typing your search above and press return to search.

బ్రూలకు ఓటింగ్ చాన్స్.. ఈసీ నిర్ణయం

By:  Tupaki Desk   |   22 Nov 2018 7:17 AM GMT
బ్రూలకు ఓటింగ్ చాన్స్.. ఈసీ నిర్ణయం
X
సరిహద్దు వివాదంలో గల్లంతైన ఓటర్లకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ ఓటు హక్కును ప్రసాదించింది. మిజోరం - త్రిపుర ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లోని కాన్హమున్ గ్రామంలో శరణార్థి శిబిరాల్లోని బ్రూ తెగ ఓటర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

త్రిపురలో శరణార్థి శిబిరాల్లో ఉంటున్న బ్రూ అని పిలిచే తెగ ఓటర్లు మిజోరంలో తమ ఓటు హక్కు వినియోగించుకునే అంశంపై వివాదం చెలరేగింది. దాదాపు 11232మంది బ్రూ తెగ ఓటర్ల వివాదం ఏకంగా మిజోరం ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ పదవికే ఎసరు తెచ్చింది. మిజోరంలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన బ్రూ శరణార్థులకు ఓటు హక్కు ఉన్నట్లు తేలింది.

మిజోరంలో ప్రస్తుతం ఎన్నికల జరుగుతున్న దృష్ట్యా వీరి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రూ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు అయితే శరణార్థులుగా వారు త్రిపురలో ఉండడంతో వారికి అందుబాటులో ఉన్న కాన్హమున్ గ్రామంలోనే ఈవీఎం యంత్రాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. మిజోరం - త్రిపుర సరిహద్దుల్లోని ఈ గ్రామంలో శిబిరాల్లో ఉంటున్న బ్రూ తెగ వారు ఓటు వేసేందుకు ఎట్టకేలకు సిద్ధం అయ్యారు.

మిజోరం - త్రిపుర సరిహద్దుల్లోని 6 శరణార్థి శిభిరాల్లో బ్రూ ఓటర్లున్నారు. మమిత్ జిల్లా పరిధిలోకి వచ్చే హచ్చెక్, దంపా, మమిత్ నియోజకవర్గాలున్నాయి. ఇందులో ఓటున్న శరణార్థులు 6 శరణార్థి శిబిరాల్లో ఉన్నారు. వీరు ఓటు వేసేందుకు వీలుగా ఏకంగా వారివద్దనే పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు అధికారులు.

మిజోరం ఎన్నికలు ఈ నెల 28న నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కోలసిబ్, టుయోరియాల్ నియోజకవర్గాల్లో బ్రూలు 3.5 శాతం మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 14 శాతం మంది బ్రూలు ఓటు హక్కు కలిగి ఉన్నారు.