Begin typing your search above and press return to search.
మోడీపై.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 10 April 2019 10:56 AM GMTసమకాలీన కాలంలో ఇంత భారీగా కేంద్ర ఎన్నికల సంఘం మీద విమర్శలు.. ఆరోపణలు రావటం ఇదే తొలిసారి. ఒకవైపునకు వంగిపోయి మరీ ఈసీ వ్యవహరిస్తుందన్న మాట అంతకంతకూ పెరుగుతోంది. నిన్నటికి నిన్న కేంద్ర సర్వీసుల్లో కీలక స్థానాల్లో పని చేసిన అరవైకి పైగా మాజీ ప్రధాన అధికారులు ఈసీపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ.. పలు అంశాల్ని ప్రస్తావించారు.
అలా వారు ప్రస్తావించిన అంశాల్లో ఒకటి మోడీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన మోడీ బయోపిక్ విడుదలకు ఆదేశాలు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. కీలకమైన ఎన్నికల వేళ.. ప్రధాని మోడీ బయోపిక్ రిలీజ్ కు ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను ఇప్పటికే విపక్షాలు సైతం ప్రశ్నించిన పరిస్థితి. మోడీ బయోపిక్ విడుదలకు అనుమతి ఇస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం సలచంన నిర్ణయాన్ని తీసుకుంది. 2019 లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ పీఎం నరేంద్ర మోడీతో సహా ఎలాంటి బయోపిక్ లు విడుదల చేయరాదంటూ ఆదేశాల్ని జారీ చేసింది.
రాజకీయ పార్టీలు కానీ.. రాజకీయ నేతలు కానీ.. వారికి ప్రచారం చేకూర్చే ఏ బయోపిక్ లు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రదర్శించకూడదని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్ మోడీగా నటించిన నమో బయోపిక్ విడుదలపై దాఖలైన వాజ్యంపై స్పందించిన అత్యుత్తమ న్యాయస్థానం.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోమని పేర్కొంది. ఈ విషయంపై తుది నిర్ణయం ఈసీదేనని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఊహించని రీతిలో స్పందించిన ఈసీ.. మోడీ బయోపిక్ తో పాటు.. మరే ఇతర బయోపిక్ లను లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ అనుమతించకూడదన్న నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల వేళలో మోడీ బయోపిక్ రిలీజ్ అయితే.. భారీ ప్రయోజనాన్ని ఆశించిన వారికి తాజా నిర్ణయం షాకింగ్ గా మారిందని చెప్పక తప్పదు. ఈసీ తాజా నిర్ణయం మోడీ పరివారానికి దిమ్మ తిరిగే షాకిస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకాలం ఈసీ వంగిపోయి పని చేస్తుందంటూ విరుచుకుపడినోళ్లు.. విమర్శలు చేస్తున్న వారు.. తాజా నిర్ణయంతో కామ్ గా ఉండాల్సి వస్తుందేమో?