Begin typing your search above and press return to search.

ఈవీఎంలపై తప్పుడు ప్రచారంపై ఈసీ సిరియస్.. కేసు నమోదు

By:  Tupaki Desk   |   12 March 2021 4:30 AM GMT
ఈవీఎంలపై తప్పుడు ప్రచారంపై ఈసీ సిరియస్.. కేసు నమోదు
X
మిగిలిన సందర్భాల్లో పెద్ద చర్చకు రాని ఈవీఎంల సామర్థ్యం.. విశ్వసనీయత మీద సరిగ్గా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మాట్లాడుతుంటాయి. ఎవరికి వారు తమ తమ స్టాండ్ ను వెల్లడిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఈవీఎంల హ్యాకింగ్ పై ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్ టీఎస్ క్రిష్ణమూర్తి అనుమానం వ్యక్తం చేసినట్లుగా ఒక ఫేక్ న్యూస్ వైరల్ గా మారింది. దీన్ని ఒక వెబ్ సైట్ పబ్లిష్ చేసింది.

ఈ సమాచారం అందుకున్న ఈసీ సీరియస్ అయ్యింది. 2017 నాటి ఒక తప్పుడు వార్తను మళ్లీ అప్ లోడ్ చేసి.. ఎన్నికల ప్రక్రియ మీద తప్పుడు భావన కలిగేలా చేయటంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన ఈసీ.. అందుకు తగ్గట్లే తాజాగా.. ఆ వార్తకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

ఈవీఎంలకు తిరుగులేదని.. దానిపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈసీ స్పష్టం చేస్తోంది. తన పేరు మీద వస్తున్న వార్తలో నిజం లేదని.. అదో తప్పుడు వార్త అని.. దాన్ని నమ్మొద్దని సదరుమాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ మరోసారి స్పష్టం చేశారు. సంచలనాల కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే.. కేసుల ఉచ్చులో ఇరుక్కుంటారన్న విషయాన్ని తాజా చర్యతోఈసీ స్పష్టం చేశారని చెప్పాలి.