Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి మామూలు వాహనంలో.. సెక్యురిటీ అధికారి బుల్లెట్ ఫ్రూవ్ వెహికిల్ లో

By:  Tupaki Desk   |   15 March 2021 4:16 AM GMT
ముఖ్యమంత్రి మామూలు వాహనంలో.. సెక్యురిటీ అధికారి బుల్లెట్ ఫ్రూవ్ వెహికిల్ లో
X
మీరు చదివింది నిజమే. పశ్చిమబెంగాల్ లోని ఈ సిత్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉంది. జెడ్ ప్లస్ సెక్యురిటీ ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని.. అలాంటి ఆమెపై దాడి జరగటమా? అంటూ ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. తనపై దాడి జరిగిందని చెబుతున్న మమత ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఎన్నికల సంఘం చెప్పటం గమనార్హం. మమతపై దాడికి సంబంధించి పూర్తిగా అధికారుల వైఫల్యంగా తేల్చారు.

ఈ ఉదంతంపై ఎన్నికల సంఘం నియమించిన ఇద్దరు పరిశీలకులు తాజాగా ఇచ్చిన నివేదికలో పలు షాకింగ్ అంశాలు ఉన్నాయి. ఈ దాడికి పూర్తి బాధ్యతగా మమత భద్రతా డైరెక్టర్ కమ్ ఐపీఎస్ అధికారి వివేక్ సహాయ్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు.. జెడ్ ప్లస్ భద్రత ఉన్న ముఖ్యమంత్రి సాదాసీదా కారు వినియోగిస్తుంటే.. ఆమె సెక్యురిటీ అధికారి మాత్రం బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని వినియోగిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రచార సమయంలోనే మమత మామూలు కారులో.. సెక్యురిటీ అధికారి మాత్రం సీఎంకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనంలో ప్రయాణించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. బందోబస్తు సరిగా నిర్వహించనందుకు ఎస్పీ ప్రవీణ్ ప్రకాశ్ ను సస్పెండ్ చేశారు.ఆయన స్థానంలో సునీల్ కుమార్ యాదవ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా మమత మీద దాడి ఏమో కానీ.. పలువురు ఉన్నతాధికారులు సస్పెండ్ అయిన పరిస్థితి.