Begin typing your search above and press return to search.
కేంద్రానికి షాకిచ్చిన ఈసీ.. మోడీ ఫొటో వద్దు
By: Tupaki Desk | 7 March 2021 8:30 AM GMTకేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. త్వరలో జరుగనున్న ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఇచ్చే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లో ప్రధాని మోడీ ఫొటోను ప్రచురించవద్దంటూ ఆదేశాలిచ్చింది.
ఎన్నికలు జరుగున్న రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఫొటోను ప్రచురించడం ద్వారా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఈ లేఖ అనంతరం ఈసీ కేంద్రానికి ఈ మేరకు సూచనలు చేసింది.
త్వరలోనే తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిల ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక కేంద్రానికి ఈసీ రాసిన లేఖలో ఎవరి పేరును పెట్టలేదని.. కేవలం ప్రధాని ఫొటోలు కనిపించకుండా ఫిల్లర్లు మాత్రమే వాడాలంటూ సూచించిందని సమాచారం.