Begin typing your search above and press return to search.

ఈవీఎంలపై అప్పుడలా.. ఆర్‌వీఎంలపై ఇప్పుడు ఇలా!

By:  Tupaki Desk   |   18 Jan 2023 12:30 PM GMT
ఈవీఎంలపై అప్పుడలా.. ఆర్‌వీఎంలపై ఇప్పుడు ఇలా!
X
ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌ స్థానంలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)పై గతంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై ఎన్నో ఆరోపణలు చేశాయి. ఏ పార్టీకి వేసినా ఫలానా పార్టీకి పడేలా వాటిలో మార్పులు చేశారని విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ వరుసగా అధికారంలోకి రావడంలో ఈవీఎంలదే కీలకపాత్ర అని.. వాటిని మానిప్యులేట్‌ చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ఈవీఎంల్లో ఒక్క శాతం కూడా లోపాలు లేవని తేల్చిచెప్పింది. మీడియా సాక్షిగా వాటిని ట్యాంపర్‌ చేయడం సాధ్యం కాదని బహిరంగంగా చేసి చూపించింది. టీడీపీ సైతం ఈవీఎంలపై గతంలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బ్యాలెట్‌ పేపర్‌ తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు సైతం వెళ్లింది.

అయితే ఓడిపోయిన పార్టీలు మాత్రమే ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.

అయితే ప్రస్తుతం టీడీపీ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. పైగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొత్తగా తెస్తానంటున్న రిమోట్‌ ఓటింగ్‌ మెషిన్లు (ఆర్‌వీఎం)లపైన ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయడం లేదు.

అయితే ఈవీఎంలపైనే ప్రజలకు ఉన్న సందేహాలు, అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా రిమోట్‌ ఓటింగ్‌ మెషిన్లను ప్రవేశపెడుతోంది. ఈ ఓటింగ్‌ మెషిన్‌ ప్రకారం 72 నియోజకవర్గాల ఓట్లు ఓ ఓటింగ్‌ యంత్రంలో ఎక్కడి నుంచైనా వేయవచ్చని చెబుతున్నారు. ఈ ఆర్‌వీఎంల పనితీరును ప్రదర్శించి చూపారు కూడా. ఈ ఆర్‌వీలంపై దేశంలో ప్రతిపక్ష పార్టీలు యథాలాపంగా విముఖత ప్రదర్శిస్తున్నాయి. బ్యాలెట్‌ తోనే ఎన్నికలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

అయితే టీడీపీ ఆర్‌వీఎంలను స్వాగతించడం విశేషం. అయితే ఆర్‌వీఎంలను ఇంత హడావుడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీస్తోంది. ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ లాంటి సైతం బ్యాలెట్‌ పేపర్‌ తోనే ఎన్నికలు నిర్వహించాలంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీలు ఆర్‌వీఎంలపైన ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.