Begin typing your search above and press return to search.
ఏపీలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల!
By: Tupaki Desk | 23 April 2018 11:52 AM GMTటీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన గాలి ముద్దు కృష్ణమనాయుడు.... ఈ ఏడాది ఫిబ్రవరి 7న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గాలి ముద్దు కృష్ణమ నాయుడి మరణంతో ఆ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో, తాజాగా జరగబోతోన్న ఉప ఎన్నికల నోటిఫికేషన్ ను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం విడుదల చేసింది. దాంతో పాటు మహారాష్ట్ర ఎమ్మెల్సీల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీఐ ప్రకటించింది. మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీఐ తెలిపింది.
ఏప్రిల్ 26 నుంచి నామినేషన్ లు స్వీకరిస్తామని - మే 3వ తేదీ నామినేషన్లు వేయడానికి చివరి తేదీ అని ప్రకటించింది. మే 4న నామినేషన్ల ను పరిశీలిస్తామని - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ మే 7 అని తెలిపింది. మే 29లోపు ఈ ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని ఈసీఐ తెలిపింది. మహారాష్ట్రలో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడంతో అక్కడ ఈసీఐ ఎన్నికలను నిర్వహించనుంది. ఏపీ కేబినెట్ మినిస్టర్ గా పనిచేసి - చిత్తూరు స్థానిక సంస్థల తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్యంతో ఫిబ్రవరి 7న హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గాలి ముద్దు కృష్ణమ నాయుడు.....పుత్తూరు ఎమ్మెల్యేగా రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఎన్నికైన సంగతి తెలిసిందే.