Begin typing your search above and press return to search.
మాంద్యం వేళ తెలంగాణ కు కాసులు కురిశాయి.. ఎవరి పుణ్యమంటే?
By: Tupaki Desk | 25 Jan 2020 4:26 AM GMTఆర్థికమాంద్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. ఆదాయం అంతకంతకూ తగ్గుతున్న పరిస్థితి. అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. మాంద్యం ప్రభావం తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో భారీగా గండి పడుతుందని భావిస్తే.. అందుకు భిన్నంగా రెండు రంగాల నుంచి వచ్చిన అదనపు ఆదాయం తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఏడాది వ్యవధిలో ఎదుగుదల కొట్టొచ్చినట్లుగా కనిపించటం గమనార్హం. అదెలా సాధ్యమైందంటే.. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరగటమేనని చెప్పాలి.
2018 డిసెంబరు కు 2019 డిసెంబరు ఆదాయాన్ని పోల్చి చూసినప్పడు ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరిగింది. ఏడాదిలో ఈ పెరిగిన మొత్తం రూ.2731 కోట్లు కావటం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ.. వ్యయాలకు సంబంధించిన నివేదికను కాగ్ కు ప్రభుత్వం సమర్పించింది.
ఈ సందర్భంగా ఎక్సైజ్.. రిజిస్ట్రేషన్ల మీద పెరిగిన ఆదాయ వివరాల్ని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు శాఖల నుంచి గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పెద్ద ఎత్తున పెరిగింది. మాంద్యం వేళ వృద్ధి రేటు 8 శాతం కంటే తక్కువ గానే ఉన్నా.. ఆదాయం మాత్రం భారీగా పెరగటం విశేషం.అయితే.. ఈ ఊపు అమ్మకం పన్నుల్లో మాత్రం లేకపోవటం గమనార్హం. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది కేవలం రూ.8.14 కోట్లు మాత్రమే ఆదాయం పెరిగింది. జీఎస్టీ ఆదాయంలోనూ లోటు కొట్టొచ్చినట్లుగా కనిపించింది.
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలంగాణ రాష్ట్రానికి పొరుగున ఉన్న ఏపీ లో గత ఏడాది కంటే ఈ ఏడాది ఆదాయం రూ.10వేల కోట్లు తగ్గినట్లుగా అధికారులు గుర్తించారు. ఏపీలో ఆదాయం పెరిగిన వేళ.. అందుకు భిన్నంగా తెలంగాణ లో మాత్రం ఆదాయం పెరగటం శుభ పరిణామంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ప్రజల కొనుగోలు శక్తికి నిదర్శనమైన అమ్మకపు పన్ను.. జీఎస్టీ ఆదాయం తగ్గటం మాత్రం ఆందోళన ను కలిగించే అంశాలు గా మారాయని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక సంవత్సరం లో తెలంగాణ ప్రభుత్వం రూ.24.08వేల కోట్లు రుణాల రూపంలో సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు ముగిసే నాటికి రూ.21.71 వేల కోట్లను సేకరించింది. ఆర్థిక సంవత్సరం ముగియటానికి మరో మూడు నెలల టైం ఉన్న నేపథ్యంలో అనుకున్న రీతిలో రుణాల సమీకరణ పెద్ద కష్టమైన విషయం కాదని భావిస్తున్నారు. ఏమైనా.. మాంద్యం వేళ.. ఆదాయం పెరుగుదల మాత్రం తెలంగాణ కు శుభసూచకంగా అధికారులు అభివర్ణిస్తున్నారు.