Begin typing your search above and press return to search.

పరుగుల వీరుడికి ఆర్థిక నేరగాళ్ల షాక్.. రూ.వంద కోట్లు కొల్లగొట్టారు

By:  Tupaki Desk   |   19 Jan 2023 1:09 PM GMT
పరుగుల వీరుడికి ఆర్థిక నేరగాళ్ల షాక్.. రూ.వంద కోట్లు కొల్లగొట్టారు
X
ఉసేన్ బోల్ట్.. జమైకా పరుగుల వీరుడు. ఈ తరంలో అతడిని మించిన పరుగు వీరుడు లేరంటారు. ఒకటి రెండు కాదు.. వరుసగా మూడు ఒలింపిక్స్ లో స్వర్ణాలు కొల్లగొట్టిన చరిత్ర అతడిది. 2008, 2012, 2016 ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించాడు బోల్ట్. ఆరేళ్ల కిందట 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు. పరుగులో ఎవరూ పట్టుకోలేని అతడిని ఓ ఆర్థిక మోసగాడు మాత్రం పట్టేశాడు. ఏకంగా రూ.103కోట్లు కొట్టేశాడు. పెట్టుబడి ఖాతా నుంచి స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌) సంస్థలో బోల్ట్‌ కొన్నేళ్ల కిందట పెట్టుబడి ఖాతా తెరిచాడు.

ఈ సంస్థ జమైకాకు చెందినది. బోల్ట్.. రిటైర్మెంట్‌, లైఫ్‌ టైం సేవింగ్స్‌లో భాగంగా ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడు. దీనిలో అతడికి 12.8 మిలియన్‌ డాలర్లు ఉండగా.. జనవరి రెండో వారం నాటికి కేవలం 12 వేల డాలర్ల బ్యాలెన్స్‌ మాత్రమే చూపించింది.

ఇదంతా ఎలా జరిగిందా? అని ఆరా తీస్తే.. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్యనే కారణమని స్పష్టమైంది. మాజీ ఉద్యోగే నేరస్థుడు ఎస్‌ఎస్‌ఎల్ సంస్థలో బోల్డ్‌కు ఉన్న ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.103కోట్లకు పైమాటే) మాయమయ్యాయి. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ఈ డబ్బు దోచుకున్నట్లు తెలిసింది. అయితే, పది రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బోల్ట్ న్యాయవాదులు కంపెనీని హెచ్చరించారు.

మరోవైపు ఈ మోసాన్ని ఈ నెల ఆరంభంలోనే గుర్తించినట్లు స్టాక్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌ తెలిపింది. ఓ మాజీ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాల కారణంగా తమ క్లయింట్స్‌ ఖాతాల్లో నుంచి మిలియన్‌ డాలర్ల మొత్తం మాయమైనట్లు జనవరి 12న కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.

బోల్ట్ మాత్రమే కాదు.. మరో 30 మంది ఎస్‌ఎస్‌ఎల్ లో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న వారిలో బోల్ట్ ఒక్కడే కాదు. మరో 30 మంది ఖాతాదారులు కూడా ఉన్నట్లు తెలిసింది. డబ్బులు కోల్పోయినట్లు సమాచారం. దీంతో దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకొనేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

కాగా.. ఈ ఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్‌ స్పందించారు. ఇది తీవ్రమైన నేరమని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని అధికారులను సూచించారు. ఘటన నేపథ్యంలో ఎస్‌ఎస్‌ఎల్‌ కంపెనీపై చర్యలు చేపట్టారు. కంపెనీ మేనేజ్‌మెంట్‌ బాధ్యతలను తాత్కాలికంగా ప్రభుత్వ అధికారులు చేతుల్లోకి తీసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.