Begin typing your search above and press return to search.

మోడీ భారీ ప్యాకేజీ ...లాభాల బాట పట్టిన మార్కెట్లు !

By:  Tupaki Desk   |   13 May 2020 6:00 AM GMT
మోడీ భారీ ప్యాకేజీ ...లాభాల బాట పట్టిన మార్కెట్లు !
X
గత కొన్ని రోజులుగా కంటికి కనిపించని మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ఆ మహమ్మారి ప్రభావం ప్రతి రంగంపై చాలా స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా స్టాక్ మర్కెట్స్ పై ఈ మహమ్మారి ప్రభావం బాగా కనిపించింది. లాక్ డౌన్ ప్రకటించకముందు మునుపెన్నడూ చూడని విదంగా రికార్డ్ స్థాయిని తాకినా సెన్సెక్స్ ...లాక్ డౌన్ ప్రకటించిన కొద్దిరోజులకే కుప్పకూలిపోయింది. అయితే, ఆ తరువాత కొంచెం కోలుకున్నప్పటికీ మళ్లీ ఆ రేంజ్ లో దూసుకెళ్లలేక పోయింది.

అయితే, ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ..ప్రజలను ఆదుకునేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని తాజాగా ప్రకటించారు. దీనితో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ సంక్షోభం, లాక్ ‌డౌన్‌ నేపథ్యంలో రూ. 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ ను ఆరంభించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1200 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు ఎగిసింది.

ప్రస్తుతం 933 పాయిట్లు ఎగిసి 32305 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు లాభపడి 9472 వద్ద కొనసాగుతోంది. దీని ద్వారా కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలను దాటేసాయి. మరోవైపు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయబోతున్నారు. రూ.20 లక్షల కోట్లను ఏయే రంగాలకు ఎంత కేటాయిస్తున్నదీ చెప్పబోతున్నారు. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలంగా వుంది. దీనితో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌, ఆటో, మెటల్‌ షేర్లలో కొనుగోళ్ల ధోరణి నెలకొంది. నెస్లే, భారతి ఎయిర్టెల్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మ, హెచ్‌ సీఎల్‌ టెక్‌ స్పల్పంగా నష్ట పోతున్నాయి.