Begin typing your search above and press return to search.

ఆర్థిక సర్వే : దేశ పరిస్థితి ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   31 Jan 2022 12:30 PM GMT
ఆర్థిక సర్వే : దేశ పరిస్థితి ఎలా ఉందంటే?
X
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రపతి ప్రసంగించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టారు.

ఆర్థికసర్వే ప్రకారం.. 2022-23లో జీడీపీ వృద్ధి 8-8.5 శాతంగా అంచనావేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ సర్వేను రాజ్యసభలో సమర్పిస్తారు. దీని తర్వాత సర్వే పూర్తి వివరాలను బహిరంగ పరుస్తారు.

ఆర్థిక సర్వే ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఆర్థిక సమీక్షలో రెండో, మూడో కరోనా వేవ్ ల మధ్య దేశం ఎలా పురగోమించిందో తెలుస్తోంది. 2022-23లో 8-8.5 శాతం ఆర్థిక వృద్ధి రేటు అంచనావేశారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 9.2 శాతం కంటే తక్కువ కావడం గమనార్హం.

వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి 70-75 డాలర్ల ధర వద్ద ముడిచమురు ఆధారంగా అంచనా వేయబడింది. దీనిప్రస్తుత ధర సుమారు 90 డాలర్లుగా ఉంది.

ఇక 20 ఏళ్లలో తొలిసారిగా ప్రభుత్వ సంస్థను ప్రైవేటీకరించి బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ , పవన్ హాన్స్, ఐడీబీఐ బ్యాంక్, బీఈఎం, ఆర్ఐఎణ్ఎల్ ల విక్రయానికి మార్గం సుగమం చేస్తుందని ఆర్థికసర్వే పేర్కొంది. 18000 కోట్ల రూపాయలకు ఎయిర్ ఇండియా యాజమానాన్యాన్ని ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం టాటా గ్రూప్ నకు అప్పగించింది. ఇందులో రుణం చెల్లించేందుకు రూ.15300 కోట్లు వినియోగించనున్నారు.

ఆర్థిక సర్వే ప్రకారం.. ఐటీ బీపీవో రంగం, ఈకామర్స్ మినహా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2.26 శాతం వృద్ధితో 19.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల(రూ.373.43 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థనురూపొందించడానికి ఈ కాలంలో మౌలికసదుపాయాల కోసం 1.4 లక్షల కోట్ల డాలర్లు (రూ.1056 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఆర్థిక సర్వే ప్రకారం.. పునరుత్పాదక ఉత్పత్తులకు ప్రోత్సహాకాలు ఇచ్చినప్పటిప్పటికీ నీతి అయోగ్ జాతీయ ఇందధన విధానం ముసాయిదా ఆధారంగా బొగ్గుకు డిమాండ్ 2030 నాటికి 130-150 కోట్ల టన్నులుగా ఉంది.