Begin typing your search above and press return to search.

టెక్కీలకు కష్టకాలం.. కథ మళ్లీ మొదటికొచ్చిందా?

By:  Tupaki Desk   |   17 Nov 2022 2:30 AM GMT
టెక్కీలకు కష్టకాలం.. కథ మళ్లీ మొదటికొచ్చిందా?
X
2020 సంవత్సరం ప్రారంభంలోనే కరోనా మహమ్మరి ప్రపంచానికి పరిచయమైంది. ఈ మహమ్మరి దెబ్బకు రెండేళ్లపాటు జనాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. కోవిడ్ వాక్సిన్ వచ్చేంత వరకు కూడా ప్రజలు ఇళ్ళకే పరిమితం కావాల్సి వచ్చింది. మాస్కులు ధరించడం.. శానిటైజర్లు రాసుకోవడం.. ఇంట్లోనే వర్క్ హోం వర్క్ జాబ్ చేసుకుంటూ కాలం వెళ్లదీశారు.

అత్యవసరమైతే తప్పా బయటికి రావొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానాలు కూడా విధించిన ఘటనలు అనేకం ఉన్నాయి. లాక్ డౌన్లు.. పాక్షిక లాకౌన్లను ఆయా దేశాలు పాటించడంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో పేద సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ కాలంలో చాలా ప్రైవేటు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ జాబ్స్ ప్రొవైడ్ చేశారు. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో లక్షలాది మంది రోడ్డున పడాల్సి వచ్చింది. ఈ సమస్య నిరుద్యోగాన్ని మరింతగా పెంచింది. అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితులు మళ్లీ మామూలుగా మారుతున్నాయని అంతా భావించారు.

అయితే బడా కంపెనీలన్నీ కూడా తమ ఉద్యోగులను వరుసబెట్టి తొలగిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక మాంద్యంతో సాప్ట్ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులన్నీ ఇటీవల కాలంలో నిలిచిపోతున్నాయి. దీనికితోడు పబ్లిషర్స్ తమ ప్రకటనల ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ మల్టీ నేషనల్ కంపెనీలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

కరోనా సమయంలో అమెరికా ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా డబ్బులను పంపిణీ చేసి కొంతమేర ఆదుకుంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరిగిన తర్వాత చాలామంది నగరానికి దూరంగా తక్కువ ధరలో ఉండే ఇళ్ళను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పై పడింది. అదేవిధంగా చేతిలో డబ్బులున్న వారంతా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు.

దీని ఫలితంగా సూచీలకు హైప్ వచ్చి ద్రవ్యోల్బణం కొంతకాలం బాగానే ఉన్నట్లు కన్పించింది. అయితే కొంతకాలంగా షేర్ మార్కెట్లు దారుణంగా పతనవుతుండటంతో కంపెనీలన్నీ క్రమంగా నష్టాలను చవిచూస్తున్నాయి. మరోవైపు ఇళ్ల ధరలు భారీగా తగ్గడంతో ఆ రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు ఉద్యోగులను వదిలించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

దిగ్గజ కంపెనీలైన మెటా.. ట్వీట్టర్.. మైక్రో సాప్ట్ తదితర కంపెనీలన్నీ కూడా వేలల్లో ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. మెటా 11 వేల మంది (13శాతం) ఉద్యోగులను.. ట్వీట్టర్ 3వేల 700 మంది (50శాతం).. ఇంటెల్.. స్నాప్ 20 శాతం మేర.. రాబిన్ హుడ్ 30 శాతం.. గీత.. సేల్స్ ఫోర్స్.. లిప్ట్ 13 శాతం మేరకు ఉద్యోగులను ఇటీవలీ కాలంలో తొలగించడం ఆర్థిక మాద్యం పరిస్థితికి అద్దం పడుతోంది.

మైక్రో సాప్ట్.. షాపిఫై.. నెట్ ఫిక్స్.. కాయిన్ బేస్ సైతం తమ ఉద్యోగులను తొలగించే ప్రక్రియ చేపట్టింది. ఆపిల్.. అమెజాన్.. డిస్నీ.. లింక్డ్ ఇన్ కంపెనీల్లో నియామకాలు స్తంభించిపోయాయి. రాబోయే 2023 సంవత్సరంలోనూ సిలికాన్ వ్యాలీ టెక్కీలకు కఠిన పరిస్థితులు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రియల్ ఎస్టేట్.. ప్రకటన రంగం మరింత మందగించడం ఖాయమని చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.