Begin typing your search above and press return to search.

భారత్‌ ఆర్థిక వ్యవస్ధకు వారి సాకారం కావాల్సిందే...

By:  Tupaki Desk   |   30 Sep 2019 3:08 PM GMT
భారత్‌ ఆర్థిక వ్యవస్ధకు వారి సాకారం కావాల్సిందే...
X
భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదగడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఆర్ధిక వ్యవస్థ ఆ స్థాయిలో ఎదగడానికి ఐఐటియన్ల వినూత్న సాంకేతికత కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. సోమవారం ఐఐ‌టి మద్రాస్ 56వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగిస్తూ...భారతదేశం ఐదు లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు.

అయితే ఈ ప్రయత్నం ఫలించాలంటే ఐఐ‌టియన్ల సాకారం - సాంకేతికత కావాలని కోరారు. ఐఐటియన్లలో తాను నవ భారత స్ఫూర్తిని చూస్తున్నానని - మీలో శక్తి - ఉత్సాహం - సానుకూల దృక్పథం మన స్వపాల్నను నెరవేర్చుకునేందుకు దోహదపడతాయని అన్నారు. ఇటీవల జరిగిన అమెరికా పర్యటన గురించి స్నాతకోత్సవంలో మోడీ గుర్తు చేశారు. అక్కడ అంతా న్యూ ఇండియా గురించి చర్చించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత సంతతి ప్రజలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.

సైన్స్‌ - టెక్నాలజీ - ఇన్నోవేషన్‌ రంగాల్లో భారతీయుల ఘనత అమోఘమన్నారు. బ్రాండ్‌ ఇండియాను మీరంతా విశ్వవ్యాప్తం చేస్తున్నారని ప్రధాని చెప్పారు. తమిళం పురాతన భాషలలో ఒకటి అని, అందరికీ ఇది నేర్పించాలని తాను స్వయంగా చెప్పానని అన్నారు. అలాగే తాను అమెరికాలో ఉంటున్నప్పుడు...ఒకసారి తమిళ భాషలో మాట్లాడానని అన్నారు. ఇది ప్రాచీన భాషలలో ఒకటి అని అందరికీ చెప్పానని అన్నారు. ఈ రోజు తమిళ భాష మొత్తం అమెరికాలో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు.