Begin typing your search above and press return to search.

డిసిహెచ్ఎల్ కు ఈడి పెద్ద షాక్

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:31 PM GMT
డిసిహెచ్ఎల్ కు ఈడి పెద్ద షాక్
X
డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పెద్ద షాకే ఇచ్చింది. డిసిహెచ్ఎల్ కు సంబంధించిన రూ. 122 కోట్ల స్దిరాస్తిని అటాచ్ చేసేసినట్లు ప్రకటించింది. గతంలోనే రూ 144 కోట్ల రూపాయలు విలువైన స్ధిరాస్తులను అటాచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రివిన్షెన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పిఎంఎల్ఏ)2002, ప్రకారం స్ధిరాస్తులను అటాచ్ చేసుకున్నట్లు తాజాగా ఈడీ ఓ ప్రకటన చేసింది. డక్కన్ క్రానికల్ యాజమానులు టి వెంకట్రామిరెడ్డి, టీవీ రెడ్డిలు బినామీ కంపెనీలు ఏర్పాటు చేసి మనీ ల్యాండరింగ్ కు పాల్పడినట్లు ఈడి గతంలోనే కేసు నమోదు చేసింది.

గతంలో బ్యాంకుల దగ్గర భారీ ఎత్తున అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన ఆరోపణలపై యాజమాన్యంపై ఈడీ కేసులు నమోదు చేసింది. 14 ప్రాంతాల్లో యాజమాన్యానికి ఉన్న ఆస్తులను ఇప్పుడు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయి. డిసిహెచ్ఎల్ యాజమాన్యానికి బెంగుళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, గుర్ గావ్, చెన్నై ప్రాంతాల్లో స్ధిరాస్తులున్నాయి. ఇప్పుడు అటాచ్ చేసిన ఆస్తులు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ బోర్డు పరిధిలోకి రావని ఈడీ స్పష్టంగా చెప్పింది. యాజమాన్యానికి వ్యతిరేకంగా సీబీఐ, బిఎస్ అండ్ ఎఫ్సి, క్రైంపోలీసులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా 2015 నుండి దర్యాప్తు జరుగుతోంది.

యాజమాన్యంపై రకరకాల కేసుల్లో మొత్తం రూ. 8180 కోట్ల మేరకు బ్యాంకులను, ఇతరులను మోసం చేసినట్లు ఫిర్యాదులున్నాయి. సంస్ధ లాభాలను ఎక్కువగా చేసి చూపటం, అడ్వర్టైజ్ మెంటు ఆదాయాన్ని ఎక్కువగా చూపి బ్యాంకుల నుండి భారీ ఎత్తున అప్పులు తీసుకున్నారనే ఆరోపణలను యాజమాన్యం ఎదుర్కొంటోంది. ఇప్పటికే యాజమాన్యానికి సంబంధించిన చాలా స్ధిరాస్తులతో పాటు హైఎండ్ కార్లు తదితరాలను స్వాధీనం చేసేసుకుంది. మరి నమోదైన కేసులపై ఎప్పటికి విచారణ పూర్తవుతుందో ఎప్పటికి కోర్టుల్లో తీర్పులు వస్తాయో ఎవరికీ అర్ధం కావటం లేదు. మధ్యలో వేలాదిమంది ఉద్యోగులు మాత్రం నలుగిపోతున్నారు.