Begin typing your search above and press return to search.
చింపాజీలను అటాచ్ చేసిన ఈడీ
By: Tupaki Desk | 22 Sep 2019 6:07 AM GMTపెద్ద ఎత్తున ఆస్తుల్ని.. వస్తువుల్ని.. విలువైన అభరణాల్ని ప్రభుత్వానికి టాచ్ చేయటం ఈడీకి మామూలే. ఇందుకు భిన్నంగా తొలిసారి కాస్త భిన్నమైన రీతిలో మూడు చింపాజీలను నాలుగు దక్షిణ అమెరికా కోతుల్ని అటాచ్ చేయటం ఆసక్తికరంగా మారింది. అక్రమార్కుల పాటిల సింహస్వప్నంగా ఉండే ఈడీ.. తాజాగా జరిపిన సోదాల్లో చిత్రమైన పద్దతుల్లో ఏడు జంతువుల్ని అటాచ్ చేయాల్సి వచ్చింది.
రోటీన్ కు భిన్నంగా సాగిన ఈ ఉదంతంలోకి వెళితే..పశ్చిమబెంగాల్ కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్ పై మనీ లాండరింగ్ కేసు ను దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్మగ్లర్ సుప్రదీప్ గుహ ఇంటిపై దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు జంతువుల్ని వ్యన్యప్రాణి సంరక్షణ చట్టానికి భిన్నంగా ఉంచుకున్నట్లు గుర్తించారు.
దీంతో.. వీటిని ఈడీ అటాచ్ చేసింది. చింపాజీలని చిన్నచూపు చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కో చింపాజీ విలువ ఏకంగా రూ.25 లక్షలు పలుకుతుందని చెబుతున్నారు. తాము స్వాధీనం చేసుకున్న జంతువుల్ని కోల్ కతాలోని అలిపోర్ జంతుప్రదర్శనశాలలో ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ జంతువులు పర్యాటకుల్ని ఆకర్షిస్తూ.. ఆదాయాన్ని ఆర్జించేలా చేస్తున్నాయని చెబుతున్నారు. ఈడీ చరిత్రలో తొలిసారి జంతువులను అటాచ్ చేసినట్లు చెబుతున్నారు.