Begin typing your search above and press return to search.

మన ఈడీ విదేశాల్లోనూ జెండా ఎగరేసింది

By:  Tupaki Desk   |   3 July 2015 9:46 AM GMT
మన ఈడీ విదేశాల్లోనూ జెండా ఎగరేసింది
X
దేశంలోనే అతిపెద్ద అక్రమాస్తుల వ్యవహారాల్లో ఒకటిగా పేరొందిన కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు ప్రారంభించింది. బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి విదేశాలలో ఆస్తులు సంపాదించిన ఆ సంస్థ పై జూలు విదిల్చింది. మొట్టమొదటిసారి విదేశాలలో ఉన్న రూ.1,280 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

అహ్మదాబాద్ లోని జూం డెవలపర్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ నిర్వహకులు వివిధ చోట్ల వ్యాపారాలు చేస్తున్నామని అనేక బ్యాంకులలో రుణం తీసుకున్నారు. తరువాత రుణం తీసుకున్న నగదు వాయిదాల పద్దతిలో తిరిగి చెల్లించడం మానేశారు. ఆ సంస్థ చుట్టు తిరిగిన బ్యాంకుల అధికారులు చివరికి విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసులు నమోదు అయ్యాయి. రంగంలోకి దిగిన ఈడీ... జూం డెవలపర్స్ అమెరికాలోని కాలిఫోర్నియాలో రూ. వెయ్యి కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. వాటిని ఈడీ జప్తు చేసింది.. అక్కడి కోర్టు సహాయంతో చర్యలు తీసుకుని ఆ భూమి క్రయవిక్రయాలకు వీలులేకుండా నిలుపుదల ఉత్తర్వులు తెప్పించింది. అంతేకాకుండ అహ్మదాబాద్ లో జూం డెవలపర్స్ కు చెందిన 1,200 ఎకరాల భూములను కూడా జప్తు చేశారు.

కాలిఫోర్నియాలోని ఆస్తులను జప్తు చేసి విచారణ చేపట్టారు. వివిధ బ్యాంకులకు జూం డెవలపర్స్ రూ.2,200 కోట్లు కుచ్చుటోపి పెట్టింది. ఈ విషయం సీసీబీ పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. విజయ్ చౌధరి కి చెందిన జూం డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముంబై నగరంతో పాటు అనేక నగరాలలో తమ సంస్థ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. విజయ్ చౌధరి ఇప్పుడు పరారీలో ఉన్నాడు.