Begin typing your search above and press return to search.

డీకే శివకుమార కేసు లో అడ్డంగా బుక్ అయిన ఈడీ!

By:  Tupaki Desk   |   16 Nov 2019 7:03 AM GMT
డీకే శివకుమార కేసు లో అడ్డంగా బుక్ అయిన ఈడీ!
X
కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు అయితే చేశారు కానీ ఆయనపై తాము మోపిన అభియోగాలను నిరూపించ లేకపోతున్నట్టు గా ఉన్నారు. కొన్నాళ్లు ఆయనను తీహార్ జైల్లో పెట్టారు. అయితే ఆయన బెయిల్ మీద బయట కు రాగలిగారు. చిదంబరం వంటి వారికి బెయిల్ దొరకక పోయినా డీకే శివకుమారకు బెయిల్ లభించింది. ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లారు.

అక్కడ ఆయన కు భారీ స్వాగతం లభించింది కాంగ్రెస్ కార్యకర్తల నుంచి. ఆ సంగతలా ఉంటే.. డీకే శివకుమార కు బెయిల్ రద్దు చేయాలని ఈడీ వాదిస్తూ ఉంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ఆసక్తి దాయకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అవి ప్రహసనం లా ఉన్నాయి కూడా. డీకే శివకుమార కేసు లో ఈడీ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా పెద్ద తప్పే చేసినట్టు గా ఉన్నారు.

న్యాయమూర్తుల కు తన వాదలను కాగితాల ద్వారా ఆయన సమర్పించారు. అయితే ఆ కాగితాల్లో డీకే శివకుమార పేరుకు బదులుగా మాజీ కేంద్ర మంత్రి అని పేర్కొన్నారట! కర్ణాటక కాంగ్రెస్ నేత పేరు ఉండాల్సిన చోట.. చిదంబరం హోదాను మెన్షన్ చేశారట. ఇలా వారు దొరికి పోయారు.

ఇవన్నీ కాపీ పేస్ట్ వాదనలు అని న్యాయమూర్తులు అభిప్రాయ పడ్డారు. ఒక కేసులోని వాదనలనే మరో కేసులు కూడా సమర్పించడం పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసినట్టు గా తెలుస్తోంది. ఈడీ తరఫు వాదనల్లోని ఈ డొల్లతనం బయట పడటం తో.. శివకుమార కు బెయిల్ రద్దు చేయాలన్న ఈడీ పిటిషన్ ను కూడా న్యాయస్థానం కొట్టి వేసింది!