Begin typing your search above and press return to search.
వారి వద్ద నుంచి 2340 కేజీల వజ్రాల్ని.. ముత్యాల్ని వెనక్కి తెచ్చారట
By: Tupaki Desk | 11 Jun 2020 4:00 AM GMTబ్యాంకులకు భారీగా దెబ్బేస్తూ.. వేలాది కోట్ల రూపాయిల్ని మోసం చేసిన ప్రముఖ వజ్రాల వ్యాపారులు నీరవ్ మోడీ.. మెహుల్ చోకీ ఉదంతాలు ఎంత సంచలనంగా మారాయో తెలిసిందే. వీరి కారణంగా బ్యాంకులకు బ్యాంకులే సంక్షోభంలో చిక్కుకున్న పరిస్థితి. వీరి మోసాల లెక్క తేల్చేందుకు ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును స్పీడప్ చేసింది.
పక్కా ప్లానింగ్ తో హాంకాంగ్ వెళ్లిన అధికారులు పెద్ద ఎత్తున వజ్రాలు.. ముత్యాల్ని స్వాధీనం చేసుకోగలిగారు. బ్యాంకులకు దెబ్బేసిన నీరవ్.. చోక్సీలను ఆ మధ్యన అరెస్టు చేయటం తెలిసిందే. బ్యాంకుల్ని మాయచేసి వేలాది కోట్లు రుణంగా తీసుకున్న వారి నుంచి రికవరీ చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలు తాజాగా కొంతమేర ఫలించాయి.
హాంకాంగ్ లోని వారి సంస్థల నుంచి 2340 కేజీల పాలిష్డ్ వజ్రాలు.. ముత్యాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని 108 బ్యాంగుల్లో సర్ది తాజాగా భారత్ కు తీసుకొచ్చారు. ఈ బ్యాగుల్లో నీరవ్ మోడీకి చెందినవి 32 సంచులు ఉంటే.. చోక్సీకి సంబంధించిన సంచులు 76 ఉండటం గమనార్హం.
ఇంత భారీగా వజ్రాలు.. ముత్యాలు తీసుకొచ్చినా.. వాటి వీలువ మాత్రం రూ.1350 కోట్లకు మించవని చెబుతున్నారు. బ్యాంకుల వద్ద నుంచి తీసుకున్న ఐదారు వేల కోట్ల రూపాయిల్ని రికవరీ చేయాలంటే భారీ ఎత్తున వజ్రాలు.. ముత్యాలు స్వాధీనం చేసుకుంటే కానీ సాధ్యం కాదేమో?