Begin typing your search above and press return to search.
కోట్లకు కోట్లు: దేశ.. విదేశాల్లో గ్యాంగ్‌స్టర్ భారీగా ఆస్తులు
By: Tupaki Desk | 11 July 2020 11:10 AM GMTఉత్తరప్రదేశ్ గ్యాంగస్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అతడు ఉత్తరప్రదేశ్‌లో గ్యాంగ్‌స్టర్‌గా హల్‌చల్ చేశాడు. సెటిల్‌మెంట్లు.. దందాలు.. గ్యాంగ్‌లను నిర్వహిస్తూ కోట్లకు కోట్లు సంపాదించాడని పోలీసులు గుర్తించారు. దుబె తోపాటు అతడి అనుచరులు ఐదుగుర్ని ఎన్‌కౌంటర్‌లో పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. హత్యలు, దోపిడీలు, బలవంతపు వసూళ్లతో యూపీ పోలీసులకు కొరకరాని కొయ్యగా మారిన వికాస్ దూబేను శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టారు.
ఆ రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని దూబే విస్తరించాడు. ఈ క్రమంలోనే భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తోంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఆస్తులను కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎన్‌కౌంటర్ చేయడంతో ఆ కేసుపై ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా అతడి స్థిర, చరాస్తుల వివరాలను అందజేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉత్తరప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.
దుబెకు సంబంధించిన ఆస్తులు యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, థాయలాండ్‌లో ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అక్కడ దూబే అనుచరులు విలాసవంతమైన భవనాలను కొనుగోలుచేసినట్టు పోలీసులు గుర్తించారు. దుబె మూడేళ్లల్లో దాదాపు 14 దేశాల్లో సందర్శించినట్లు తేలింది. ఆస్తులను.. విలువైన స్థలాలను అతడు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రూ.23 కోట్ల విలువైన ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. ఒక్క యూపీలోనే తన బినామీల పేర్లతో 11 ఇళ్లు, 16 ఫ్లాట్స్ కొనుగోలుచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. మూడేళ్లలో 14 సార్లు విదేశాలకు వెళ్లిన దూబే అక్కడ ఆస్తులను కొనుగోలుచేసినట్టు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. దూబేకి చెందినవిగా భావిస్తోన్న యూపీలోని 11 ఇళ్లు, 16 ఫ్లాట్స్‌పై దృష్టి సారించామని పోలీసులు తెలిపారు. లక్నోలోని ఆర్యన్‌నగర్‌లో రూ.23 కోట్లతో కొనుగోలు చేసిన బంగ్లా కూడా ఉందని తెలిపారు.
దూబే ఆస్తుల వివరాలను సమర్పించాలని జులై 7వ తేదీన కాన్పూర్ పోలీసులను ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్ చట్టం 2002లోని నిబంధనలు అనుసరించి దూబేతోపాటు అతడి కుటుంబసభ్యులు, అనుచరుల పేరుతో ఉన్న స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలను అందించాలని కోరింది. అతడిపై ఉన్న కేసుల వివరాలపై కూడా సమాచారం ఇవ్వాలని తెలిపింది. దీంతోపాటు కొంతమంది వ్యాపారవేత్తల కోసం మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది.