Begin typing your search above and press return to search.
ఈడీ కుదుపు...తెలుగు అధికారి మీద డౌటా....?
By: Tupaki Desk | 24 Dec 2022 2:30 AM GMTఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇపుడు పలు కేసులు చూస్తూ బిజీగా ఉంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో కేసులలో చురుకుదనం ప్రదర్శిస్తోంది. ఈ నేపధ్యంలో ఏకంగా తెలంగాణాలో అధికారంలో ఉన్న బీయారెస్ నేతల మీద ఈడీ చూపు ఉంది. వారిలో కొందరిని విచారణ పేరుతో పిలుస్తున్నారు కూడా ఈ సమయంలో టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా బీజేపీకి బీయారెస్ కి మధ్య సాగుతోంది.
ఈ క్రమంలో ఉన్నట్లుండి సడెన్ గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి నేతృత్వం వహిస్తున్న దినేష్ పరుచూరిని బదిలీ చేశారు. ఆయన వచ్చి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది.కానీ ఆయన్ని ఇంతలోనే బదిలీ చేయడం అంటే రాజకీయంగా ఇది చర్చకు తావిస్తోంది. ఇంతకీ దినేష్ పరుచూరిని బదిలీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డైరెక్టర్ల ర్యాంక్ హోదాలో కొచ్చి జోనల్ కార్యాలయానికి అని తెలిసింది.
దినేష్ పరుచూరి ఆగస్ట్ లోనే హైదరబాద్ ఈడీ ఆఫీస్ చీఫ్ గా అభిషేక్ గోయల్ ప్లేస్ లో వచ్చారు. ఆయన ఇంకా సీటులో కుదురుకోనేలేదు బదిలీ చేయడమే చర్చకు తావిస్తోంది. ఆయన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ ఫర్ పేరిట కొచ్చీకి మార్చేశారు. ఆయన స్థానంలోకి రోహిత్ ఆనంద్‌ను హైదరాబాద్ జోనల్ ఆఫీస్ కొత్త చీఫ్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఇక ఈడీ దూకుడు ఇటీవల కాలంలో బాగా ఎక్కువగా ఉంది అన్నది తెలిసిందే. ఈడీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నుండి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనల వరకూ చాలా కేసులు చూస్తోంది. అలాగే ఈడీ ప్రస్తుతం 2017లో ఛేదించిన కాసినో కేసుతో పాటు డ్రగ్స్ కుంభకోణాన్ని కూడా విచారిస్తోంది. అలాగే క్యాసినో కేసులో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితోపాటు క్యాసినో నిర్వాహకుడు చిక్కోటి ప్రవీణ్‌కుమార్, బీఆర్‌ఎస్ నేతలతోపాటు పలువురికి నోటీసులు జారీ చేసి విచారించింది.
మరో వైపు చూస్తే మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి బీయారెస్ ఎమ్మెల్యేగా ఉన్న పైలెట్ రోహిత్ రెడ్డిని కూడా తాజాగా ఈడీ నోటీసులు ఇచ్చి మరీ విచారిస్తోంది. ఆయన ఫాం హౌస్ లో బీయారెస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆపరేషన్ని రట్టు చేశారు ఇక వీటికి మించి చూస్తే ఢిల్లీ లిక్కర్ కుంభంకోణానికి సంబహ్దించి బీయారెస్ మహిళా నాయకురాలు, కేసీయార్ తనయ అయిన కల్వకుట్ల కవితను ఈడీ విచారిస్తోంది. ఇలా రాజకీయంగా అత్యున్నత స్థాయిలో వారిని ఈడీ విచారిస్తున్న నేపధ్యంలో స్ట్రాంగ్ ఆఫీసర్ ని తెచ్చి మరీ పెట్టారని అంటున్నారు.
తెలుగు అధికారిగా దినేష్ పరుచూరి ఉన్నారు. ఆయన ఏమైనా కాస్తా సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తారు అన్న అనుమానాలు ఎక్కడో కేంద్రానికి ఉండి ఉండవచ్చు అందువల్లనే ఆయన్ని బదిలీ చేసి మరీ తాము కోరుకున్న తీరున విచారణ జరిగేలా కొత్త ఆఫీసర్ ని ఆయన ప్లేస్ లో నియమించారు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయంగా ఇది కీలకమైన బదిలీ అని చెప్పాలి.
దీన్ని బట్టి చూస్తే కేంద్రంలోని బీజేపీ బీయారెస్ నాయకుల మీద వారి మీద ఉన్న కేసుల విషయంలో ఎంత సీరియస్ గా వ్యవహరిస్తోందో అన్నది కూడా అర్ధమవుతోంది అని అంటున్నారు. ఇక ఈ బదిలీ తో మరికొన్ని అంచనాలు వస్తున్నాయి. తొందరలో కీలకమైన సంచలనమైన అరెస్టులు కూడా ఈడీ ద్వారా చోటు చేసుకుంటాయని, అలాగే తమ దర్యాప్తుకు సంబంధించి ఏ మాత్రం సూది బెజ్జం అంత సమాచారం కూడా లీక్ కాకుండా చూసేందుకు పకడ్బంధీగా ఉండేందుకే ఈడీ ఈ రకమైన డెసిషన్ తీసుకుంది అని అంటున్నారు. సో ఇక మీద ఈడీ దూకుడు వేరే లెవెల్ లో ఉంటుంది అన్న సంకేతాలు మాత్రం ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.