Begin typing your search above and press return to search.

మాజీ ఎంపీ రాయపాటి పై కేసు నమోదు చేసిన ఈడీ !

By:  Tupaki Desk   |   3 Jan 2020 5:27 AM GMT
మాజీ ఎంపీ రాయపాటి పై కేసు నమోదు చేసిన ఈడీ !
X
సీనియర్ రాజకీయ నేత , టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి మెడ కు కేసులు ఉచ్చు కొద్దీ కొద్దిగా బిగుసుకుంటోంది. బ్యాంకులకు రుణాల ఎగవేత పైన ఇప్పటికే అయన పై సీబీఐ కేసు నమోదు చేయగా , తాజాగా ఆయన పైన ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. రూ.16 కోట్ల రూపాయలు సింగపూర్, మలేషియా కి మళ్లించినట్లు గా ఈడీ గుర్తించింది. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీపై ఈడీ కేసు నమోదు చేసింది. 15 బ్యాంకుల నుంచి 8,832 కోట్ల రూపాయలు రుణాలను కంపెనీ తీసుకుంది. అందు లో 3,822 కోట్ల రూపాయల ఫండ్‌ డైవర్ట్‌ అయినట్లుగా సీబీఐ అనుమానిస్తోంది. ఈ కేసులోనే మాజీ ఎంపీ కుమారుడు రామారావు, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ట్రాన్స్‌ ట్రాయ్‌ తో తమకు సంబంధం లేదని..సీబీఐ తాను ఇంట్లో లేని సమయం లో సోదాలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. కానీ , రాయపాటి పైన ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ట్రాన్స్‌ ట్రాయ్‌ సంస్థ ప్రాజెక్టుల కోసం 15 బ్యాంకుల కన్సార్షియం నుండి దాదాపు రూ. 8,832 కోట్లు రుణం సేకరించింది. అందులో తాజాగా ఇండియన్ బ్యాంకు..కెనరా బ్యాంకులు తమకు రుణాల రీ పేమెంట్ రాక పోవటంతో సీబీఐకి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన సీబీఐ రాయపాటి మీద కేసు నమోదు చేసింది. అయితే, ఈ సంస్థ ఇప్పటి వరకు 15 బ్యాంకుల కన్సార్షియం నుండి సేకరించిన రుణాల్లో దాదాపు రూ 3.822 కోట్ల మేర నిధులు డైవర్ట్ అయినట్లు గా సీబీఐ అనుమానిస్తోంది. ఇక, ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఫెమా చట్టం కింద కేసు నమోదు కావటం.. ఈడీ రంగ ప్రవేశం చేయటం తో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో అని చర్చలు జరుగుతున్నాయి.