Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ముఖ్యనేత ఈడీకీ ఎలా చిక్కారంటే...
By: Tupaki Desk | 26 Oct 2017 5:33 AM GMTఓ సంస్థను వేల కోట్లు ముంచిన నిందితుడికి బెయిల్ ఇప్పించేందుకు ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు ముడుపులు ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం వహించినట్లు కాంగ్రెస్ నేత - శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేకకోర్టులో మొయిన్ ఖురేషీపై మనీల్యాండరింగ్ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో షబ్బీర్ అలీ ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఈ కుంభకోణంలో పేర్లన్నీ బయటికి వచ్చినప్పటికీ - ఢిల్లీలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి తనకేమీ నోటీసులు రాలేదని షబ్బీర్ అలీ చెప్తున్నారు. అయితే అసలింతకు ఏంటి కేసు? ఏం జరిగిందనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం...హైదరాబాద్ కు చెందిన ఎంబీఎస్ నగల దుకాణం వ్యాపారి సుఖేష్ గుప్తా బంగారం దిగుమతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీఎస్)కు సుమారు రూ. 200 కోట్లు టోకరా వేయడంతో 2013లో సుఖేశ్ గుప్తాను సీబీఐ అరెస్ట్ చేసింది. సుఖేశ్ గుప్తాకు హైదరాబాద్ లో బెయిల్ ఇప్పించేందుకు ఎవరూ సహకరించకపోవడంతో ఢిల్లీ బాటపట్టారు. సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాతో చెప్పించి బెయిల్ ఇప్పించాలని సుఖేశ్ గుప్తా సోదరుడు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. బెయిల్ ఇప్పించేందుకు అప్పటి కాంగ్రెస్ మంత్రులైన షబ్బీర్ అలీ - బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఢిల్లీ వ్యాపారి సతీశ్ సనాను కలువగా - హవాలా వ్యవహారాల్లో ఆరితేరిన మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ పేరు తెరపైకి వచ్చింది. అనేక కేసుల్లో బెయిల్ ఇప్పించేందుకు లాబీయింగ్ చేసే ఖురేషీతోనే సమస్య పరిష్కారమవుతుందనే నిర్ణయానికి వచ్చారు. తర్వాత రూ.2 కోట్లు సతీశ్ సనా ద్వారా ఖురేషీకి అందజేశారు.
అయితే తర్వాతే పరిణామం మారిపోయింది. బెయిల్ రాకపోవడంతో డబ్బుల విషయమై రెండువర్గాల మధ్య వాగ్వావాదం జరిగింది. షబ్బీర్ అలీ - సతీష్ సనాలు ఖురేషీని ఢిల్లీలోని అతని ఫాంహౌస్ లో కలిసి నిలదీశారు. సీబీఐ అప్పటి డైరెక్టర్ రంజిత్ సిన్హా ఇంటి వద్ద ఉన్న హోటల్ కు రావాలని, బెయిల్ విషయమై మాట్లాడి వస్తానని తీసుకెళ్లాడు. దీంతో షబ్బీర్ అలీ - సతీశ్ సనాలు ఖురేషి చూపించిన హోటల్ కు వెళ్లగా - రంజిత్ సిన్హా ఇంట్లోకి ఖురేషీ వెళ్లొచ్చి ఈ సారి బెయిల్ వస్తుందని, దర్యాప్తు కూడా పూర్తయ్యిందని చెప్పి పంపించాడు. ఈ పైరవీ ప్రక్రియలో బొత్స సత్యనారాయణ కూడా సతీశ్ సనాతో కలిసి ఖురేషీతో సమావేశమయ్యారు.
అయితే అనూహ్య రీతిలో ఈ వ్యవహారం తెరమీదకు వచ్చింది. వివిధ స్కాంలపై సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా, అధికారులను ప్రలోభపెట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు చేసిన ఖురేషి వ్యవహారం ఇటీవల దృష్టికొచ్చింది. ఈ క్రమంలోనే ఖురేషీ నెట్ వర్క్ మొత్తాన్ని సీబీఐ ఛేదించింది. ఈడీ సైతం అతని వ్యవహారాలపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేపట్టింది. ఖురేషీ బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని, అందులోని ఫోన్ నంబర్లు - మేసేజ్ లు - కాల్ డాటాను సేకరించింది. దేశవ్యాప్తంగా అత్యున్నతస్ధాయిలో పనిచేస్తున్న అధికారులు - దర్యాప్తు సంస్ధల చీఫ్ లు - ప్రజాప్రతినిధులతో సన్నిహిత సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. ప్రభుత్వ అధికారులకు లంచంగా ఇచ్చిన నగదును హవాలా మార్గంలో ఫ్రాన్స్ - బ్రిటన్ దేశాలకు పంపించినట్టు మొబైల్ ఫోన్ ఆధారంగా నిర్ధరించుకున్నది. ఖురేషీతో సంబంధాలున్న వ్యాపారి సతీశ్ సనాను అదుపులోకి తీసుకొని విచారించింది. ఇద్దరి నుంచి ఈడీ సేకరించిన వాంగ్మూలంలో సుఖేశ్ గుప్తా కోసం కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ - ప్రస్తుత వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మధ్యవర్తిత్వం జరిపినట్టు తేల్చారు. సీబీఐ కేసులు ఎత్తివేయడం, బెయిల్ ఇప్పించడం కోసం కోనేరు ప్రదీప్ - సతీశ్ సనా - అశోక్ జైన్ - ముఖుల్ జోషి - అజాహర్ సాబ్ - గౌతం నుంచి రూ.11.09 కోట్లను ఖురేషీ వసూలు చేసినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. ఖురేషీతో షబ్బీర్ అలీ - బొత్స సత్యనారాయణకు ఉన్న సంబంధాలపై ఆరాతీసిన ఈడీ త్వరలో నోటీసులు జారీచేసి విచారించే అవకాశం ఉందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.