Begin typing your search above and press return to search.

టీయారెస్ ఎంపీకి గట్టి షాక్ ఇచ్చిన ఈడీ

By:  Tupaki Desk   |   17 Oct 2022 1:38 PM GMT
టీయారెస్ ఎంపీకి గట్టి షాక్ ఇచ్చిన ఈడీ
X
ఆయన టీయారెస్ ఎంపీ. సీనియర్ మోస్ట్ లీడరు. పేరు నామా నాగేశ్వరరావు. ఆయన టీయారెస్ పార్టీ తరఫున లోక్ సభ పక్ష నాయకుడు. ఇక ఆయనకు వ్యాపార వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాటి మీద గత కొంతకాలంగా దృష్టి పెట్టిన ఈడీ తాజాగా గట్టి షాక్ ఇచ్చేసింది. ఏకంగా 80.65 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దీంతో ఎంపీ గారికి గట్టి దెబ్బ తగిలినట్లు అయింది.

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని ఎంపీ గారి మధుకాన్ ప్రధాన కార్యలయంతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాలలోని 28 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ హై వే పేరిట నామా నాగేశ్వరరావు రుణాలను తీసుకుని దారి మళ్ళించినట్లుగా ఈడీ చేస్తున్న ప్రధాన అభియోగం. ఇక ఇందులో 361.92 కోట్ల ఆస్తులు నేరుగా దారి మళ్ళినట్లుగా ఈడీ గురించిందని అంటున్నారు.

అదే విధంగా నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యల పేరిట ఆరు డొల్ల కంపెనీలు కూడా ఏర్పాటు చేశారని ఈడీ విచారణలో వెల్లడి అయింది అంటున్నారు. ఇక గతంలోనే రుణాన పేరిట నామా నాగేశ్వరరావు మోసం చేసిన కేసులో 73.43 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

ఇక ఈడీ ఈ కేసులో నామా కుటుంబానికి సంబంధించిన ఇళ్ళు, అఫీసులతో పాటు, అనేక సంస్థలలో గతంలోనే సోదాలు చేసి వివరాలు సేకరించింది. దాంతఒ పాటు నామా కుటుంబసభ్యుల ఇళ్లలోనూ గతేడాది జూన్ మాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి గతేడాది ఈడీ విచారణకు నామా నాగేశ్వర్ రావును పిలిచినా ఆయన హాజరు కాలేదు.

మరో వైపు చూస్తే నిధులు దారి మళ్ళించాయని ఆరోపిస్తున్న రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిధుల మళ్లింపు కేసులో మధుకాన్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు. రాంచి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం మధుకాన్ కంపెనీ బ్యాంకుల నుండి సుమారు రూ.1064 కోట్ల రుణం తీసుకుంది. దాంతోనే ఈ నిధులలో సుమారు రూ.264 కోట్లు దారి మళ్లాయని సీబీఐ గుర్తించింది. ఈ మేరకు 2019వ సంవత్సరంలో సీబీఐ కేసు నమోదు చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది.

ఇక తాజాగా ఈడీ ఆస్తులను జప్తు చేయడంతో నామా విషయంలో భవిష్యత్తులో మరింత జోరు చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. టీయారెస్ కీలక ఎంపీ మీద ఈడీ ఈ సడెన్ షాక్ ఇస్తూ యాక్షన్ లోకి దిగడం రాజకీయంగా చర్చ సాగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.