Begin typing your search above and press return to search.

చిక్కుల్లో సంజయ్ రౌత్.. ఆస్తులు జప్తు చేసిన ఈడీ!

By:  Tupaki Desk   |   5 April 2022 12:44 PM GMT
చిక్కుల్లో సంజయ్ రౌత్.. ఆస్తులు జప్తు చేసిన ఈడీ!
X
శివసేన , ఎన్సీపీ నేతలను ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తున్న బీజేపీ ఇప్పుడు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా శివసేన కుడిభుజం లాంటి సంజయ్ రౌత్ పై తీవ్ర చర్యలకు దిగి హెచ్చరికలు పంపింది. శివసేనకు పెద్ద దిక్కు అయిన సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేయం సంచలనమైంది.

కొద్దిరోజులుగా ఉద్దవ్ ఠాక్రే సారథ్యంలోని మహా వికాస్ అగాది మహారాష్ట్ర ప్రభుత్వానికి , బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ కు మధ్య పోరు తారాస్థాయికి చేరింది. శివసేనలో సీఎం ఠాక్రే తర్వాత నంబర్ 1గా ఉన్న రాజ్యసభ ఎంపీ, పార్టీ పత్రిక సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. వేల కోట్ల పత్రా చాల్ భూకుంభకోణం కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ మంగళవారం ఈ కీలక చర్యకు దిగింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. రౌత్ కు చెందిన అలీబాగ్ లోని భవంతిని ఈడీ జప్తు చేసింది. రూ.1034 కోట్ల విలువైన పత్రా చాల్ భూకుంభకోణం కేసులో శివసేన కీలక నేత సంజయ్ రౌత్ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మీడియాకు మెసేజ్ అందజేసింది.

ఇప్పటికే పలు కేసుల్లో శివసేన, ఎన్సీపీ పార్టీలకు చెందిన దాదాపు అరడజను మంది కీలక నేతలకు ఈడీ భారీ షాకివ్వడం తెలిసిందే. ఇదే కేసుతోపాటు మరో భూకుంభకోణం ఆరోపణల్లో ఈడీ కొద్ది రోజుల కింద ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బావమరిది శ్రీధర్ మాధవ్ ఆస్తులను కూడా జప్తు చేసి షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో శివసేన, ఎన్సీపీకి చెందిన పలువురిని ఈడీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. కేంద్ర సంస్థలను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని.. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ప్రత్యర్థులపై ప్రతీకారానికి వాడుతోందని విమర్శలు, ఆరోపణలు వస్తున్నా కేంద్రం తన పని తాను చేసుకుపోతుండడం గమనార్హం.