Begin typing your search above and press return to search.
జగన్ మళ్లీ లోపలికెళ్లాల్సిందేనా?
By: Tupaki Desk | 4 Feb 2016 9:04 AM GMTవైసీపీ అధినేత జగన్ కొద్దికాలం కిందటి వరకు ఢిల్లీకి తెగ తిరిగారు. ఎవరైనా అడిగితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం అనేవారు. కానీ ఆయన ఎప్పుడు వెళ్లినా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నే కలిసేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేది హోం మంత్రి కాదు... అయినా, ఆయన్ను కలుస్తున్నారంటే కారణమేదో ఉంటుందని అనుకున్న కొందరు ఆరాతీస్తే అసలు సంగతి బయటపడింది. తనపై ఉన్న కేసుల వల్ల ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదని తెలిసిన జగన్ వాటినుంచి తప్పించుకోవడం కోసం ఓ మహిళా మంత్రి ద్వారా రాజనాథ్ ను కలిసి ప్రయత్నాలు చేశారని చెబుతారు. అయితే.. అవన్నీ విఫలమయ్యాయయని... ఈలోగా సీబీఐలోనూ మార్పులు జరిగాయి. కొత్త డైరెక్టరు రావడంతో అక్కడ వేగం పెరిగింది. దీంతో మరికొద్ది నెల్లలో జగన్ పై అబియోగపత్రాలు కూడా దాఖలు పూర్తికాబోతోందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంతలోనే ఈడీ నుంచి జగన్ కు కబురు వచ్చింది. ఇప్పటికే ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేసి, ఆరు ఆరు ఆటాచ్ మెంట్లు కూడా పూర్తిచేసిన ఈడీ జగన్ ను అన్నివైపుల నుంచి మూస్తోందని సమాచారం.
జగన్ కేసులో ఈడీ తేల్చిన లెక్క ప్రకారం అవినీతి 43 వేల కోట్లు. దీంతో సీరియస్ గా తీసుకుని కేసు గట్టిగా బిగిస్తోందని తెలుస్తోంది. జగన్ ని ఢిల్లీ లో ఈడీ గురువారం విచారిస్తోంది. విచారణ అనంతరం కొద్ది రోజుల్లో అరెస్టు చేసే అవకాశాలున్నట్లుగా చెబుతున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తరువాత ఆ తంతు పూర్తవుతుందని... జగన్ ను అత్తారింటికి పంపిస్తారని నిపుణులు చెబుతున్నారు.