Begin typing your search above and press return to search.

450 కోట్ల డీల్‌...మ‌రాఠాల ముద్దు బిడ్డపై విచార‌ణ‌

By:  Tupaki Desk   |   22 Aug 2019 10:14 AM GMT
450 కోట్ల డీల్‌...మ‌రాఠాల ముద్దు బిడ్డపై విచార‌ణ‌
X
గ‌త కొద్దికాలంగా బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన పార్టీ చీఫ్ రాజ్ థాక‌రేపై ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైర‌క్ట‌రేట్ న‌జ‌ర్ వేసింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఈడీ పోలీసులు విచారిస్తున్నారు. సీటీఎన్ ఎల్ ఇన్‌ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీలో అక్ర‌మ‌రీతిలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. సుమారు 450 కోట్ల మేర అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు ఈడీ పేర్కొంటోంది. గ‌త కొద్దికాలంగా, బీజేపీ- ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీపై విమ‌ర్శ‌లు గుప్పింస్తున్న థాక‌రే పై ఈ విచార‌ణ జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ILFS గ్రూప్ కేసును ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఐఎల్ ఆండ్ ఎఫ్ ఎస్ గ్రూప్ కోహినూర్ CTNL లో పెట్టుబడులు పెట్టింది. ఈ కోహినూర్ సీటీఎన్ ఎల్‌ సంస్థ ముంబయిలోని దాదర్ ఏరియాలో కోహినూర్ స్క్వేర్ టవర్ ను నిర్మిస్తోంది. ఈ కంపెనీలకు సంబంధించిన ఆర్థిక అవకతవకల కేసులోనే రాజ్ థాకరేను ఈడీ అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కోహినూర్‌ మిల్లు భూ అక్రమాల కేసులో రాజ్‌ థాక‌రే వ్యాపార భాగస్వాములు ఉమేశ్‌ జోషి- రాజేంద్ర శిరోద్కర్‌ లను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఇదిలాఉండ‌గా, ఈ నేప‌థ్యంలో ద‌క్షిణ ముంబైలో 144వ సెక్ష‌న్‌ ను విధించారు. రాజ్ థాక‌రే ఈడీ ఆఫీసుకు వ‌స్తున్న నేప‌థ్యంలో ముంబైలోని అనేక ప్రాంతాల్లో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. ముంబయిలోని మెరైన్ డ్రైవ్- ఎంఆర్ ఏ మార్గ్- ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈడీ ఆఫీస్- రాజ్ థాకరే ఇల్లు, ఎంఎన్ ఎస్ ఆఫీస్ దగ్గర పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రాజ్ థాకరే అనుచరుడు దేశ్ పాండేను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజ్‌ థాక‌రే భార్య శ‌ర్మిల‌- కుమారుడు అమిత్‌- కూతురు ఊర్వ‌శి కూడా ఈడీ ఆఫీసుకు వెళ్లారు.

ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి బీజేపీ గెలిచిందంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ ఎస్) చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని ఆరోపించారు. ``కేంద్రంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందింది. పాలసేకరణకు రైతులకు సరైన ధర చెల్లించకపోవడం, నిరుద్యోగం వంటి తదితర సమస్యలు రైతులతో పాటు యువతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. బీజేపీ, శివసేన మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంలో ఈవీఎంలే సహకరించాయి. లేకపోతే, ఎవరైనా అభ్యర్థి ఎన్నికలలో సున్నా ఓట్లను ఎలా పొందుతాడు?`` అని ప్రశ్నించారు. దీంతోపాటుగా, కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేస్తున్న బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి.. మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన త‌ర‌ఫున రాజ్ థాక‌రే మ‌ద్ద‌తు తెలిపారు.