Begin typing your search above and press return to search.

సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు.. విచారణకు వస్తారా?

By:  Tupaki Desk   |   24 Jun 2022 6:30 AM GMT
సోనియాకు ఈడీ మరోసారి నోటీసులు.. విచారణకు వస్తారా?
X
నేషనల్ హెరాల్డ్ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన తల్లీకొడుకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈడీ నోటీసులకు రాహుల్ గాంధీ హాజరు కాగా..ఇప్పుడు సోనియాగాంధీ వంతు వచ్చింది. ఆమెకు సడెన్ గా కరోనా సోకడంతో విచారణకు రాలేకపోయారు. తాజాగా సోనియాకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. జూలై మధ్య నాటికి విచారణలో పాల్గొనాలని తాజా నోటీసుల్లో పేర్కొంది.

ఇదే కేసులో విచారణ అంశంపై రెండు రోజుల క్రితం ఈడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. కరోనా సోకడంతో తన ఆరోగ్యం బాగాలేదని.. విచారణను వాయిదా వేయాలని ఈడీని కోరారు. సోనియా అభ్యర్థనను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అంగీకరించింది. కోవిడ్ తో బాధపడుతున్న ఆమెను విచారించడానికి ఇది సరైన సమయం కాదని భావించి విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఈ మేరకు తాజాగా సమన్లు జారీ చేసిన ఈడీ జూలై మధ్యలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ 5 రోజుల పాటు విచారించింది. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఐదు రోజుల్లో 50 గంటలకు పైగా విచారించిన ఈడీ.. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసింది.

ఈ కేసులో ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే అవకాశం ఉండడంతో సోనియాను ఈడీ పిలుస్తోందని సమాచారం. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోవిడ్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇదే విషయాన్ని ఈడీకి వివరించిన రాహుల్ గాంధీ.. తన తల్లిని చూసుకోవడం కోసం సోమవారం వరకూ విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో రాహుల్ గాంధీ అభ్యర్థనను సమ్మతించిన ఈడీ.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రస్తుతం కోవిడ్ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం రాహుల్, ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో తల్లివద్దనే ఉంటున్నారు. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని రాహుల్ ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఈడీ అంగీకరించింది.

నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తులను అక్రమంగా సోనియా, రాహుల్ సొంతం చేసుకున్నారని.. యంగ్ ఇండియా ద్వారా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని... దాదాపు 2వేల కోట్ల ఆస్తులు కొల్లగొట్టారని సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. దీనిపై హైకోర్టు సోనియా, రాహుల్ లపై దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది.

వెంటనే యంగ్ ఇండియా- నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై ఆదాయపు పన్ను డాక్యుమెంట్లను సమర్పించాలని హైకోర్టు.. సోనియా, రాహుల్ లను ఆదేశించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సోనియా, రాహుల్ లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది.. మనీలాండరింగ్ విషయంలో ఈడీ నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతోంది.