Begin typing your search above and press return to search.
ఎరువుల స్కామ్..రాజస్థాన్ సీఎంపై ఈడీ అటాక్
By: Tupaki Desk | 22 July 2020 3:00 PM GMTసచిన్ పైలెట్ తిరుగుబాటు తర్వాత రాజస్థాన్ లో పాగా వేయాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. కానీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూలకుండా కాపాడుకొని సచిన్ ను పక్కన పెట్టడంతో ఇక కేంద్రంలోని బీజేపీ సీఎం గెహ్లాట్ ను టార్గెట్ చేసింది.పాత కేసులను తవ్వి తీస్తున్నారు.
2007నాటి ఫర్టిలైజర్ కుంభకోణానికి సంబంధించిన కేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడికి చెందిన కంపెనీల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సీఎం సోదరుడికి సంబంధించిన ఈ కేసులో దేశవ్యాప్తంగా అనేక కంపెనీల్లో బుధవారం ఏకధాటిగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈడీ దెబ్బతో రాజస్థాన్ సీఎం ఫ్యామిలీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగర్షియన్ మీద 2007 నుంచి ఫర్టిలైజర్ స్కామ్ కేసు పెండింగ్ లో ఉంది. ఈ కేసును బయటకు తీసిన ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా స్కామ్ కేసులో సోదాలు ముమ్మరం చేశారు.
సబ్సిడీ ఎరువులను సీఎం సోదరుడు ఇతర ఎరువుల కంపెనీలకు భారీ మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకున్నాడని ఆరోపణలున్నాయి. మలేషియా, సింగపూర్ దేశాలకు ఎగుమతి చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఈ స్కాంతోనే రాజస్థాన్ సీఎంను కొట్టడానికి బీజేపీ సిద్ధమైంది.