Begin typing your search above and press return to search.

ఐటీ అయిపోయింది.. ఇప్పుడు మల్లారెడ్డి పైకి ‘ఈడీ’

By:  Tupaki Desk   |   24 Nov 2022 4:32 PM GMT
ఐటీ అయిపోయింది.. ఇప్పుడు మల్లారెడ్డి పైకి ‘ఈడీ’
X
తెలంగాణ మంత్రివర్గంలో ఆర్థికంగా అత్యంత బలమైన మంత్రి మల్లారెడ్డి. అందరిలోకి అత్యంత వ్యాపారాలు ఉన్నవి ఈయనకే. ఇప్పటికే ఐటీ దాడులతో మల్లారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పుడు ఐటీ దాడులు ముగియడంతో ఈడీ రంగంలోకి దిగబోతోందట..ఈడీ కేసులు పెట్టి దర్యాప్తు చేయాలని ఐటీ అధికారులు తాజాగా సమాచారం పంపారట.. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగబోతోందని తెలుస్తోంది.

ఐటీ అధికారులు పన్నులు ఎంత కట్టలేదో కనుక్కొని ఫైన్ వేస్తారు. కానీ ఈడీ అలా కాదు.. అక్రమ నగదు తరలింపు తేలితే కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. మల్లారెడ్డి ఐటీ అధికారులతో దురుసుగా వ్యవహరించారు. వారితో వాగ్వాదాలు, గొడవలకు దిగారు. కేసులు కూడా పెట్టించారు. అయితే ఐటీ అధికారులపై మల్లారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

మల్లారెడ్డిపై ఈడీ కూడా కేసులు వేస్తే ఆయనకు వ్యాపార సంస్థలకు భారీ దెబ్బనే. కేసీఆర్ ను చూసి రెచ్చిపోతున్న మల్లారెడ్డి రేపు తేడా వస్తే కేంద్రం నుంచి కేసీఆర్ కాపాడలేరన్న విషయం ఆయనకు తెలియదు. ఐటీ అధికారులపై దాడుల వరకూ వెళ్లిన మల్లారెడ్డి పరిస్థితి ఏమవుతుందోనన్న భయాలు ఆయన తరుపు వాళ్లలో వెంటాడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకూ చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.

ఒడిశా, కర్ణాటక, హైదరాబాద్ నుంచి వచ్చిన 400 మందికి పైగా ఐటీ అధికారులు, సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి సోదాలు చేశారు. స్థిరాస్తులను కూడా వాస్తవ విలువ కాకుండా తక్కువ చూపినట్టు ఆధారాలు సేకరించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.